టాలీవుడ్ సీనియర్ నటి భాను ప్రియపై రీసెంట్ గా చిన్నారిని వేధిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై భాను ప్రియా మీడియా ముందుకు వచ్చి  తన వివరణను ఇచ్చారు. చెన్నైలోని తన ఇంట్లో పనిచేస్తోన్న బాలికను తాము ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని అసలు తల్లి ప్రవర్తనను చూసి షాక్ అయినట్లు భాను ప్రియ వివరించారు.

చిన్నారి ఇంట్లో దొంగతనం చేసిన ఐ ప్యాడ్ - వాచ్ అలాగే కెమెరాను తల్లి తిరిగి ఇచ్చినట్లు చెప్పిన భానుప్రియ బంగారం డబ్బు విషయంలో కూడా పోలీస్ కేసు పెడతామని చెప్పేసరికి తల్లి డబ్బును తీసుకువస్తానని చెప్పినట్లు తెలిపారు. అయితే మళ్ళి ఆ చిన్నారి తల్లి రాకుండా తన కూతురిని కొడుతున్నట్లు హింసిస్తున్నట్లు పోలీస్ స్టేషన్ లో కేసు వేసినట్లు వార్తలు రావడంతో నేను మీడియా ముందుకు వచ్చాను అని భాను ప్రియ మాట్లాడారు. 

తూర్పు గోదావరికి చెందిన ప్రభావతి కూతురు చెన్నైలోని భానిప్రియ నివాసంలో గత కొంత కాలంగా పనిచేస్తోంది. కావాలని భానుప్రియ చిన్నారిని వేధిస్తున్నట్లు సామర్లకోట పోలీస్ స్టేషన్ లో ప్రభావతి కేసు నమోదుచేశారు.

మైనర్ బాలికపై లైంగిక దాడి.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ నిర్వాకం!