ఒకప్పటి స్టార్ హీరోయిన్ భానుప్రియకి సంబంధించిన సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ గా కొన్ని వందల చిత్రాల్లో నటించిన భానుప్రియ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు దక్కించుకుంటోంది.

తాజాగా ఆమె ఓ 14 ఏళ్ల అమ్మయిని వేధిస్తున్నట్లు ఆమెపై కేసు నమోదు చేశారు. సామర్లకోటకి చెందిన ప్రభావతి అనే మహిళ భానుప్రియపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఈ కేసుకి సంబంధించిన విషయాలు తెలిసినవారు షాకవుతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ప్రభావతి కొందరు సలహాలతో తన 14 ఏళ్ల కూతురిని చెన్నైలో భానుప్రియ ఇంటిలో పనికి పెట్టింది.

మొదట్లో తన కూతురిని ఇంటికి పంపుతూ, ఫోన్ లో మాట్లాడిస్తూ బాగానే ఉండేవారని కానీ ఇప్పుడు తన కూతురిని వేధిస్తున్నట్లు ప్రభావతి తెలిపింది. ఏడాది కాలంగా తన కూతురిని ఇంటికి పంపకుండా వేధిస్తున్నారని ప్రభావతి వాపోయింది. భానుప్రియ సోదరుడు తన కుమార్తె పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నాడని... తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని సంచలన ఆరోపణలు చేసింది.

చెన్నై చైల్డ్ హెల్ప్ లైన్ కు కూడా సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. సొసైటీలో పేరున్న భానుప్రియ లాంటి వాళ్లు ఇలాంటి పనులు చేయడంపై సర్వత్రా విమర్శలు  వ్యక్తమవుతున్నాయి.