గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో మీటూ సంఘటనలు ఒక్కొక్కరిగా బయట పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మీడియా ముఖంగా వెల్లడించారు.

చాలా మంది హీరోలు, దర్శకుల పేర్లు ఈ మీటూ ఉద్యమంలో వినిపించాయి. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫ్ చేసిన గణేష్ ఆచార్యపై లైంగిక ఆరోపణల కేసు నమోదైంది.

నన్ను ముద్దు పెట్టుకున్నాడని ఎలా నిరూపించాలి.. చిన్మయి ఆవేదన!

కొరియోగ్రాఫర్, నటుడు గణేశ్ తనను వేధిస్తున్నాడంటూ.. ఓ మహిళా డ్యాన్స్ మాస్టర్.. మహారాష్ట్ర మహిళా కమిషన్, ముంబాయిలోని అంబోలీ పీఎస్ ఫిర్యాదు చేశారు. ఫిలిం అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ జెనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న గణేష్.. తన నుండి కమీషన్ తీసుకోవాలని చూశాడని.. ఇవ్వనందున రోజూ పోర్న్ వీడియోలు చూడాలంటూ వేధిస్తున్నాడని పోలీసులకు తెలిపారు.

కమీషన్ ఇవ్వని కారణంగా తనకు ఇండస్ట్రీలో పని రాకుండా చేస్తున్నాడని ఆరోపించారు. దీనిపై ఉమెన్ కమీషన్ చర్యలు తీసుకుంటోంది. గణేష్ ఆచార్యపై ఇటీవల లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కూడా ఆరోపణలు చేశారు. తన పేరు, పలుకుబడిని వాడుకుంటూ కొత్తగా వస్తోన్న కొరియోగ్రాఫర్ లను పాడుచేస్తున్నారని అన్నారు.

నటి తనుశ్రీదత్తా కూడా గణేష్ పై ఆరోపణలు చేశారు. బాలీవుడ్ వందల సినిమాలకు పని చేసిన గణేష్ ఆచార్య అల్లు అర్జున్ నటించిన 'డీజే' సినిమాలో ఓ పాటకి కొరియోగ్రాఫ్ చేశాడు.