ప్రముఖ సింగర్ చిన్మయి తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ లు వైరల్ గా మారాయి. చాలా కాలంగా ఈమె మీటూ ఉద్యమం కోసం పోరాడుతోంది. ప్రముఖ లిరిసిస్ట్ వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని మీడియా ముందు బయట పెట్టింది చిన్మయి.

అయితే ఈ విషయంలో తనను అందరూ నోటికొచ్చినట్లు మాట్లాడారని సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు పెట్టింది. వైరముత్తు తనను లైంగికంగా వేధించాడనే విషయాన్ని బయటపెట్టినట్లు తమిళనాడుకి చెందిన కొందరు ప్రముఖులు, జర్నలిస్ట్ లు తనను తిట్టారని.. తనలాంటి వారి వలనే నిజంగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు న్యాయం జరగడం లేదని అన్నారని తెలిపింది.

ప్రియాంక హత్య: ఆమె 100కి ఎందుకు కాల్ చేయలేదంటే.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్!

ఓ ప్రెస్ మీట్ కి వెళ్లినప్పుడు తను జుట్టు సరిచేసుకుంటూ ఉంటే కొందరు ఫోటోగ్రాఫర్లు తన చేతులు, వక్షోజాలపై కెమెరాలు జూమ్ చేస్తూ ఫోటోలు చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి ఎగతాళి చేసినట్లు  చెప్పుకొచ్చింది. అత్యాచార ఘటనలపై ఎవరైతే బాధపడతారో వారంతా సమాజంలో మార్పుని తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నం చేయరని కామెంట్స్ చేసింది.

సమాజానికి చనిపోయిన అమ్మాయిలంటేనే ఇష్టమని.. ధైర్యంగా పోరాడే అమ్మాయిలను మాత్రం పట్టించుకోరని చెప్పింది. వైరముత్తు గొప్ప లిరిసిస్ట్ అని.. అందుకే ఆయన్ని ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని తెలిపింది. 18 ఏళ్ల వయసులో వైరముత్తు తన నడుం పట్టుకొని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని.. ఆ విషయాన్ని ఎలా నిరూపించుకోమంటారు..?ఆధారాలు ఎక్కడ నుడ్ని తీసుకురావాలి..? అంటూ ప్రశ్నించింది. కళ్లల్లో, వక్షోజాల్లో కెమెరాలు పెట్టుకొని తిరగమంటారా..? అంటూ మండిపడింది.