ప్రముఖ బాలీవుడ్‌ ఫోటోగ్రాఫర్‌  డబూ రత్నాని శ్రీదేవి ఫ్యామిలీ ఫోటోను ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేశాడు. ఈ ఫోటోలో అతిలోక సుందరి శ్రీదేవి, ఆమె భర్త నిర్మాత బోనీ కపూర్‌, ఇటీవల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌తో పాటు ఆమె చెల్లెలు ఖుషీ కపూర్‌లు ఉన్నారు. అంతా సాంప్రదాయ బద్ధంగా రెడీ అయ్యి ఈ ఫోటో దిగారు. అప్పట్లో డబూ రత్నాని తీసిని బోని ఫ్యామిలీ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటో ఇది. ఫోటోతో పాటు `వేల మాటలకు సమానమైన ఫోటో. ఆ జ్ఞాపకాలు వెల కట్టలేనివి` అంటూ కామెంట్ చేశాడు.

బాలీవుడ్‌ లో తొలి లేడీ సూపర్‌ స్టార్ గా ఎదిగిన శ్రీదేవి దాదాపు 300 చిత్రాల్లో నటించింది. ఆమె సినీ కెరీర్ దాదాపు 50 ఏళ్ల కోనసాగింది. చివరగా మామ్ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించిన శ్రీదేవి, షారూఖ్‌ ఖాన్ హీరోగా తెరకెక్కిన జీరో సినిమా అతిథి పాత్రలో కనిపించింది.