సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన సెలెబ్రిటీలలో పూనమ్ కౌర్ కూడా ఒకరు. సమాజంలో జరుగుతున్న అనేక అంశాలపై పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటారు. నర్మ గర్భంగా పూనమ్ కౌర్ చేసే కొన్ని కామెంట్స్ కూడా వైరల్ అవుతుంటాయి. 

పూనమ్ కౌర్ 2006లో ఒక విచిత్రం, మాయాజాలం లాంటి చిత్రాలతో నటిగా పరిచయమైంది. గగనం, శౌర్యం లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. ప్రస్తుతం పూనమ్ కౌర్ తమిళం, హిందీ భాషల్లో నటిస్తోంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువగా ఉండే పూనమ్ కౌర్.. అందంగా కనిపించే ఫొటో షూట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. 

తాజాగా పూనమ్ కౌర్ నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూ ఎదపై టాటూ వేయించుకున్న పిక్స్ ని రివీల్ చేసింది. ఇప్పటికే దక్షిణాదిలో చాలా మంది నటీమణులు టాటూ ట్రెండ్ నాకి ఫాలో అవుతున్నారు. వారి జాబితాలో పూనమ్ కౌర్ కూడా చేరింది. ఎదపై టాటూ వేయించుకున్న ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

టాటూతో పాటు పూనమ్ కౌర్ కూడా హాట్ నెస్ తో అదరగొడుతోంది. పూనమ్ కౌర్ వేసుకున్న ఈ టాటూ అర్థం 'మా' అని వస్తుంది. శివుడి త్రిశూలం కూడా టాటూలో ఉంది. తన తల్లి బర్త్ డే సందర్భంగా విష్ చేస్తూ పూనమ్ కౌర్ ఈ టాటూ వేయించుకుంది. 

ప్రస్తుతం పూనమ్ కౌర్ టాటూ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దశాబ్దం క్రితమే త్రిష టాటూ వేయించుకుని ఈ ట్రెండ్ మొదలు పెట్టింది. సమంత, అనసూయ లాంటి క్రేజీ సెలెబ్రిటీలంతా టాటూ వేయించుకున్నారు.