పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజ్ రవితేజ మధ్య మంచి సాన్నిహిత్యం ఇది. కెరీర్ ఆరంభం నుంచి రవితేజమెగా ఫ్యామిలీతో క్లోజ్ గా ఉంటున్నాడు. దీనితో రవితేజకు పవన్ తో పరిచయం ఏర్పడింది. పలు సందర్భాల్లో వీరిద్దరూ వేదికని పంచుకున్నారు. 

నేల టికెట్టు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా పవన్ కళ్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల పవన్, రవితేజ గురించి ఆసక్తికర ప్రచారం మొదలయింది. పవన్ కళ్యాణ్, రవితేజలు కలసి త్వరలో ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 

స్టన్నింగ్ ఫోటోస్.. ఈమె ఎక్స్ పోజింగ్ కు హద్దులుండవు

తాజాగా చిత్ర  వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు వీరిద్దరితో మల్టీస్టారర్ చిత్రం ప్లాన్ చేస్తోంది గోపాల గోపాల దర్శకుడు డాలీ అట. తమిళంలో ఘనవిజయం సాధించిన విక్రమ్ వేద చిత్రాన్ని తెలుగులో పవన్, రవితేజలతో చేసేందుకు డాలి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు టాక్. 

ఇదే కనుక నిజమైతే పవన్, రవితేజ అభిమానులకు పండగే. విక్రమ్ వేద చిత్రంలో తమిళంలో విజయ్ సేతుపతి, మాధవన్ నటించారు. విజయ్ సేతుపతి పాత్రలో పవన్, మాధవన్ పాత్రలో రవితేజ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు కూడా తెలుస్తోంది.