టీవీ, సినీ రంగాలతో పాటు డిజిటిల్ మీడియా కూడా మన దేశంలో దూసుకుపోతోంది. ముఖ్యంగా అమిజాన్ ప్రైమ్, నెట్ ప్లిక్స్, ఆహా వంటి యాప్స్ విస్తృతి తో ఈ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు తగ్గట్టుగా సీరియల్స్, సినిమాలతో పాటు వెబ్ సీరీస్ ల నిర్మాణం కూడా ఊపందుకుంది. డిజిటల్ మీడియం ద్వారా భారీ పబ్లిసిటీ, రెవెన్యూ వస్తుండటంతో స్టార్స్ కూడా వీటి మీద దృష్టి పెట్టారు. అదే విధంగా కియారా కూడా సినిమాలతో సమానంగా వెబ్ సీరిస్ లు చేయటానికి ఉత్సాహం చూపిస్తోంది.

మహేష్ తో చేసిన ‘భరత్‌ అనే నేను’, రామ్ చరణ్ తో చేసిన  ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన కియారా అద్వానీని తెలుగువాళ్లకు బాగానే గుర్తుండి ఉంటుంది. కేవలం సౌత్ లోనే కాక, బాలీవుడ్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న కియారా గత ఏడాది నెట్ ప్లిక్స్ వారి ‘లస్ట్‌ స్టోరీస్‌’లో నటించి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు ‘గిల్టీ’ అనే మరో వెబ్‌ ఫిల్మ్‌కి సైన్‌ చేసింది కియారా. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఖరారు చేస్తూ ట్వీట్ చేసారు.

అందాల కేరళ కుట్టి... అనుపమ రేర్ పిక్స్!

ఈ వెబ్ సీరిస్ కు రుచి నరైన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సిటీకి కొత్తగా వచ్చిన ఓ పల్లెటూరి అమ్మాయికి కాలేజీలో ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఈ వెబ్‌ ఫిల్మ్‌ తెరకెక్కుతోంది. ఈ సీరిస్ లోనూ హాట్ సన్నివేశాలు ఉంటాయంటున్నారు. లస్ట్ స్టోరీస్ తరహాలో ఇదీ వివాదాస్పదమై వార్తల్లో నిలిచే అవకాసం ఉందిట. అయితే కియారా అవన్నీ కొట్టిపారేస్తోంది. ప్రాజెక్టు ప్రారంభం కాకుండానే అప్పుడే తాను వాటి గురించి మాట్లాడలేనంటోంది.