సినీ తారలు, క్రీడా ప్రముఖుల మధ్య ప్రేమాయణం సహజమే. ఇండియాలో క్రికెట్ కు క్రేజ్ పెరిగిన రోజుల నుంచి ఈ ప్రేమ వ్యవహారాలు సాగుతూనే ఉన్నాయి. ఆయా సమయాల్లో పాపులర్ క్రికెటర్స్ తో ప్రేమలో పడ్డ బాలీవుడ్ హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. కానీ పెళ్లి వరకు వచ్చిన జంటలు చాలా తక్కువ. 

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నీనా గుప్త, వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ప్రేమ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్. డేటింగ్ అంటే పెద్దగా తెలియని రోజుల్లో వీరిద్దరూ కలసి జీవించారు. నీనా గుప్త పెళ్లి కాకుండానే రిచర్డ్స్ తో ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. 

ఆ తర్వాత కాలంలో కూడా వీరిద్దరూ వివాహం చేసుకోలేదు. దీనితో నీనా గుప్తాపై అనేక కామెంట్స్ వినిపించాయి. అప్పటి నుంచి తాను చాలా అవమానాలు ఎదుర్కొంటూ జీవిస్తున్నాని తాజాగా నీనా గుప్తా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

ప్రజలంతా తనని తప్పుగా అర్థం చేసుకునేలా మీడియా వార్తలు రాసింది. పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చానని అంతా నన్ను హేళనగా చూడడం ప్రారంభించారు. తానేంటో నిరూపించుకునేందుకు సోషల్ మీడియాని ఎంచుకున్నట్లు నీనా గుప్త తెలిపింది. 

ప్రేమ అనేది నా జీవితంలో జరిగిన ఓ సంఘటన మాత్రమే. అదే నా జీవితం కాదు అని నీనా తెలిపింది. నేను సోషల్ మీడియాలో ఏ ఫోటో పోస్ట్ చేసినా నన్ను రిచర్డ్స్ తో కలపి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. నా గురించి ప్రజలు తప్పుగా అనుకుంటుండడంతో నాలో అసహనం పెరిగిపోయింది. 

జిగేల్ రాణి అందాలు.. క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న బ్యూటీ!

మీడియా వల్ల అంతా నన్ను ఆ దృష్టితోనే చూసేవారు. యుక్త వయసులో ఉన్నప్పుడు రిచర్డ్స్ తో రోజు శృంగారం చేయడమే ఈమె పని అనే భావన అందరిలో ఏర్పడింది. కానీ ఓ వ్యక్తిగా నేనేంటో ప్రజలకు తెలియదు. అందుకే సోషల్ మీడియాని ఎంచుకుని నా గురించి నేను చెప్పుకోవడం ప్రారంభించా అని నీనా తెలిపింది. 

యాంకర్ అనసూయ సెక్సీ ఫోజులు.. పిచ్చెక్కించేలా గ్లామర్ షో!

నాపై ఉన్న చెడు ఇమేజ్ ని చెరిపివేసుకునే ప్రయత్నం చేస్తున్నా. తిరిగి సినిమాల్లో నటిస్తున్నా అని నీనా ఎమోషనల్ గా తెలిపింది. గత ఏడాది నీనా గుప్త, ఆయుష్మాన్ ఖురానా నటించిన బదాయి హో చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నీనా 60 ఏళ్ల వయసులో గర్భవతి అయిన మహిళగా నటించింది.