సమ్మర్ లో ఈజీగా బరువు తగ్గాలంటే తినాల్సింది వీటినే..!
నిజం చెప్పాలంటే అన్ని సీజన్ల కంటే... ఎండాకాలం బరువు తగ్గడం కాస్త సులభం అని చెప్పొచ్చు. అయితే... అంత సులభంగా బరువు తగ్గాలి అంటే... మన డైట్ లో మార్పులు చేసుకోవాలి. కాస్త వ్యాయామాల డోసు కూడా పెంచాలి.
Summer weight loss
ఈరోజుల్లో బరువు తగ్గడం చాలా ఛాలెంజింగ్ గా మారిందని చెప్పొచ్చు. రోజూ ఎంత శ్రమించినా బరువు తగ్గక ఇబ్బంది పడేవారు చాలా మంది ఉన్నారు. ఆహారం తీసుకోకుండా.. డైట్ పేరిట కడుపులు మాడ్చుకున్నవారు కూడా ఉన్నారు. కానీ.. ఈ సమ్మర్ లో మీరు ఈజీగా బరువు తగ్గే ట్రిక్ ఒకటి మేం మీకు చెప్పబోతున్నాం.
weight loss
నిజం చెప్పాలంటే అన్ని సీజన్ల కంటే... ఎండాకాలం బరువు తగ్గడం కాస్త సులభం అని చెప్పొచ్చు. అయితే... అంత సులభంగా బరువు తగ్గాలి అంటే... మన డైట్ లో మార్పులు చేసుకోవాలి. కాస్త వ్యాయామాల డోసు కూడా పెంచాలి. అయితే... ఈ కింది పండ్లు తిన్నా కూడా ఈజీగా బరువు తగ్గవచ్చట. మరి.. ఆ పండ్లేంటో ఓసారి చూద్దాం...
పుచ్చకాయ: ఈ వేసవిలో బరువు తగ్గాలంటే ఈ పండు తినండి. ఊబకాయాన్ని తగ్గించడంలో పుచ్చకాయ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కేలరీలు , చక్కెర , చాలా నీరు కలిగి ఉంటుంది. జ్యూసీగా ఉండే ఈ పండులో పీచుపదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని తింటే కడుపు నిండుతుంది. ఆకలిని ప్రేరేపించదు. దీంతో శరీర బరువు తగ్గుతుంది.
కివి: కివిలో చక్కెర చాలా తక్కువగా ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది గుండె , పొట్టకు చాలా మేలు చేస్తుంది. అంతే కాకుండా, కివి జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో గొప్పగా సహాయపడుతుంది.
orange
ఆరెంజ్: విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండు వేసవిలో బరువు తగ్గడానికి మంచి మార్గం. ఇది బరువు తగ్గించడమే కాకుండా బ్లడ్ షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో కేలరీలు, చక్కెర చాలా తక్కువ.
cucumber
కీరదోసకాయ: ఇది వేసవిలో సులభంగా దొరుకుతుంది. ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువును సులభంగా తగ్గిస్తుంది. అంతే కాకుండా వేసవిలో కీర దోసకాయ తింటే డీహైడ్రేషన్ రాదు. ఈ నాలుగు కనుక మీ డైట్ లో భాగం చేసుకుంటే.. ఈజీగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.