Asianet News TeluguAsianet News Telugu

నిఖిల్ కొడుకు పేరు ఏంటో తెలుసా... తండ్రి అయ్యాక ఆ అలవాటు వదిలేశాడట!


నిఖిల్ సిద్దార్థ తన కొడుకు పేరు రివీల్ చేశాడు. అలాగే తండ్రి అయ్యాక ఒక అలవాటు మానేశానని తాజాగా చెప్పుకొచ్చాడు. 
 

hero nikhil siddhartha reveals his son name ksr
Author
First Published Apr 19, 2024, 10:16 AM IST

హీరో నిఖిల్ సిద్ధార్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో తండ్రి అయ్యాడు. ఆయన భార్య పల్లవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. అభిమానులకు నిఖిల్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. కాగా నిఖిల్ తన కొడుకు పేరు రివీల్ చేశాడు. ధీర సిద్దార్థ అని పేరు పెట్టారట. నిఖిల్ కి వారంలో కనీసం ఒక రోజు పార్టీకి వెళ్లడం అలవాటుగా ఉందట. ఈ అలవాటును కొడుకు పుట్టాక వదిలేశాడట. 

పిల్లలు పుట్టాక మనం కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. మంచి వాతావరణంలో వాళ్ళను పెంచాలి అన్నాడు. నా జీవితం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. 15 ఏళ్ల క్రితం నా లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటుందని ఎవరైనా చెబితే నేను ఆందోళన చెందేవాడిని కాదని నిఖిల్ చెప్పుకొచ్చాడు. 2020లో లాక్ డౌన్ ఆంక్షల నడుమ అత్యంత సన్నిహితుల సమక్షంలో నిఖిల్-పల్లవి వివాహం జరిగింది. పల్లవి వృత్తిరీత్యా డాక్టర్. ఆ మధ్య నిఖిల్-పల్లవి విడిపోతున్నారంటూ పుకార్లు వినిపించాయి. ఆ వార్తలను ఈ జంట ఖండించారు. 

ప్రస్తుతం నిఖిల్ స్వయంభు టైటిల్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దర్శకుడు భరత్ కృష్ణమాచారి స్వయంభు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ కి జంటగా సంయుక్త మీనన్ నటిస్తుంది. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం నిఖిల్ చాలా కష్టపడ్డారు. గుర్రపు స్వారీ, యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకున్నాడు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios