షాగుఫ్తా రఫీక్ ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ రచయిత. పలు చిత్రాలకు ఆమె కథలు రచించారు. షగుఫ్తా రఫీక్ కు ఈ రోజు వరకు ఆమె తల్లి దండ్రులు ఎవరో తెలియదు. ఓ మహిళ షాగుఫ్తాని దత్తత తీసుకుని పెంచుకుంది. ఆమె పెంపుడు తల్లి మరో వ్యక్తితో రిలేషన్ పెట్టుకోవడం.. అతడు ఆకస్మిక మరణం చెందడంతో షగుఫ్తా, ఆమె పెంపుడు తల్లి ఇద్దరూ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. 

అలాంటి తరుణంలో షాగుఫ్తా 16 ఏళ్ల వయసులోనే బార్ డాన్సర్ గా, వ్యభిచారిగా మారింది. డబ్బు కోసం ఆమె తప్పని పరిస్థితిల్లో ఆ వృత్తిని ఎంచుకుంది. ప్రైవేట్ పార్టీలలో అంగాంగ ప్రదర్శన చేస్తూ డాన్స్ చేస్తుంటే తనపై డబ్బులు చల్లేవారని షాగుఫ్తా రఫీక్ అప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంది. 

ఒక మహిళని సమాజంలో ఎలా చూస్తారో తాను అర్థం చేసుకున్నట్లు షాగుఫ్తా తెలిపింది. ఈ  క్రమంలో షాగుఫ్తా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ క్రమంలో షాగుఫ్తా తనకు రచనపై ఉన్న ఆసక్తిని గమనించింది. ఈ క్రమంలో బాలీవుడ్ బడా నిర్మాత మహేష్ భట్ ఆమెకు అవకాశం కల్పించారు. 

ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్న షాగుఫ్తా క్రేజీ రచయితగా మారిపోయింది. బాలీవుడ్ లో ఆమె రాజ్, మర్డర్ 2, జిస్మ్ 2, ఆషిక్ 2 లాంటి రొమాంటిక్ చిత్రాలకు షాగుఫ్తా రఫీక్ రచయితగా పనిచేసింది. తెలుగులో ఆమె నీజతగా నేనుండాలి అనే చిత్రానికి కథ అందించింది. 

షాగుఫ్తా జీవితాన్ని గమనించాక కాస్త వేదాంతం కాట్లాడుకోక తప్పదు. కాలం చేసే విచిత్రాలు ఎలా ఉంటాయో ఎవ్వరికీ అంతు చిక్కవు.