మెగాస్టార్‌ చిరంజీవి తొలి చిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక ఇబ్బందులుతో,అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన గురించి మీడియాలో రావటంతో అందరూ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇప్పటికేప్రసాద్స్‌ క్రియేటివ్‌ మెంటర్స్‌ ఫిలిం మీడియా స్కూల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ సురేష్‌రెడ్డి స్పందించి.. తార్నాకలో ఉంటున్న ఈ దర్శకుడి దగ్గరకు వెళ్లి రూ.41వేలు అందజేశారు.
 
అదే విధంగా ‘మనం సైతం’ తరఫున నటుడు కాదంబరి కిరణ్‌కుమార్‌ రూ.25 వేల నగదు అందజేశారు. అంతటితో ఆపకుండా ‘మనం సైతం’ కుటుంబం నుంచి సాయం చేద్దామని ఆయన గ్రూపులో అభ్యర్థించగానే పలువురు నటులు, సినీ జర్నలిస్టులు, సాంకేతిక నిపుణులు స్పందించారు. ఆ మొత్తాన్ని కాదంబరి కిరణ్‌ స్వయంగా వెళ్లి రాజ్‌కుమార్‌కు ఇచ్చారు. స్పందించిన ప్రతి ఒక్కరికీ రాజకుమార్‌కృతజ్ఞతలు తెలిపారు.  

ప్చ్... ఎంత బ్యాంగ్రౌౌండ్ ఉన్నా.. కలిసిరాలే!

ఈ నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందిస్తారని అందరూ భావిస్తున్నారు. తన కెరీర్ పునాది రాళ్లలో ఒకరైన ఆయనకు ఖచ్చితంగా సాయం చేస్తారని ఎదురుచూస్తున్నారు. ఈ వార్త ఇంకా చిరంజీవి వద్దకు చేరి ఉండదని,లేకపోతే ఈ పాటకి ఆయన స్వయంగా వచ్చి పలకరించి, తనకు తోచిన సాయిం చేసి ఉండేవారని అభిమానులు సోషల్ మీడియాలో అంటున్నారు. గతంలోనూ చిరంజీవి చాలా మందికి సాయం అందించిన విషయాలు గుర్తు చేసుకుంటున్నారు. మెగాభిమానులు సైతం ఈయన ఆరోగ్యం కుదుటపడేందుకు కొంత సాయిం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది.

రాజ్‌కుమార్‌ .. 1977లో   ‘పునాదిరాళ్లు’కు కథ రాసుకోగా, 1978లో ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు.  ఎలాగోలా సినిమా రిలీజ్‌ చేయగా 5 నంది అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత ‘ఈ సమాజం నాకొద్దు, మన ఊరి గాంధీ, మా సిరిమల్లె’ తదితర ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించారు. కొద్దిరోజులు టీవీ సీరియళ్లకు కూడా పని చేశారు. ఎంత చేసినా ఆర్థికంగా ఎదగలేకపోయారు. సినిమాలకే ఆస్తులను ఖర్చు పెట్టారు.  ఆయనకు సాయిం చేయాలనుకునే వాళ్లు 70754 42277 నంబర్‌లో సంప్రదించొచ్చు.