హీరో విశాల్, దర్శకుడు మిస్కిన్ మధ్య వివాదం రోజు రోజుకు అసభ్యంగా తయారవుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకునేవరకు వ్యవహారం వెళ్ళింది. మిస్కిన్ దర్శత్వంలో కొన్నేళ్ల క్రితం తెరకెక్కిన డిటెక్టివ్( తుప్పారివాలన్) చిత్రం మంచి విజయం సాధించింది. 

దీనితో డిటెక్టివ్ 2 చిత్రానికి వీరిద్దరూ సిద్ధం అయ్యారు. కథ సిద్ధం చేయడంలో భాగంగా దర్శకుడు మిస్కిన్ వృధా ఖర్చులు చేశారని, కొంచెం కూడా షూటింగ్ చేయకుండా దాదాపు 13 కోట్లు ఖర్చుపెట్టారని విశాల్ ఇటీవల మిస్కిన్ ని విమర్శించాడు. దీనితో మిస్కిన్ ఈ చిత్రం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మిస్కిన్ తప్పుకోవడంతో విశాలే దర్శకత్వ భాద్యతలు స్వీకరించాడు. 

అప్పటి నుంచి మిస్కిన్, విశాల్ మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా మిస్కిన్ ఓకార్యక్రమంలో మాట్లాడుతూ విశాల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాల్ కు మంచి సినీ అందించాలని కొన్ని రోజుల క్రితం కోహినూర్ డిమాండ్ దొంగతనం నేపథ్యంలో డిటెక్టివ్ 2 కథ చెప్పాను. విశాల్ కు బాగా నచ్చింది. బడ్జెట్ ఎక్కువవుతుంది కాబట్టి మరో నిర్మాతని కూడా తీసుకుందాం అని చెప్పా. 

నితిన్ పెళ్లి వాయిదా.. మరికొన్ని రోజులు బ్యాచిలర్ బతుకే..

కానీ విశాల్ లేదు నేనే నిర్మిస్తా అని చెప్పాడు. కానీ సినిమా ప్రారంభం అయ్యాక విశాల్ కు, నాకు మధ్య బడ్జెట్ విషయంలో వాదనలు వచ్చాయి. దీనితో విశాల్ నాకు రెమ్యునరేషన్ కూడా ఇవ్వనున్నాడు. దీనితో నేను సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మా మధ్య విభేదాలు ప్రారంభమైన నేపథ్యంలో విశాల్ రోజు మా తల్లిని అసభ్యంగా దూషించాడు. నా తమ్ముడిపై కూడా చేయి చేసుకున్నాడు. 

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. ఎలా రెచ్చిపోతోందో చూశారా(హాట్ ఫోటోస్)

విశాల్ ఇక నీకు కష్టాలే.. నిన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వను అంటూ మిస్కిన్ హెచ్చరించాడు. విశాల్, మిస్కిన్ మధ్య విమర్శలు అంతకంతకు పెరుగుతుండడంతో ఈ గొడవ ఎక్కడివరకు వెళుతుందనే చర్చ తమిళ వర్గాల్లో జరుగుతోంది.