Asianet News TeluguAsianet News Telugu

నితిన్ పెళ్లి వాయిదా.. మరికొన్ని రోజులు బ్యాచిలర్ బతుకే..

యంగ్ హీరో నితిన్ ఇంట్లో ఇటీవల పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకని నితిన్ కుటుంబ సభ్యులు ఘనంగా ప్రారంభించారు. దీనితో ఏప్రిల్ లో నితిన్ వివాహం ఫిక్స్ అయింది.

Corona Virus effected Nithiin and Shalini marriage
Author
Hyderabad, First Published Mar 15, 2020, 3:42 PM IST

యంగ్ హీరో నితిన్ ఇంట్లో ఇటీవల పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకని నితిన్ కుటుంబ సభ్యులు ఘనంగా ప్రారంభించారు. దీనితో ఏప్రిల్ లో నితిన్ వివాహం ఫిక్స్ అయింది. దీనితో ఇన్నేళ్ల నితిన్ బ్యాచిలర్ లైఫ్ ముగిసి ఓ ఇంటివాడు కావడం ఖరారైపోయింది. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే అనుకున్న ముహూర్తానికి నితిన్ పెళ్లి జరిగేలా లేదు. నితిన్ కుటుంబ సభ్యులు పెళ్లిని వాయిదా వేసినట్లు సమాచారం. 

షాలినితో నితిన్ గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. తన ప్రేమ గురించి మీడియాకు తెలియకుండా ఇన్నేళ్లు నితిన్ జాగ్రత్త పడ్డారు. నితిన్ ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో వీరి పెళ్లి జరగబోతోంది. ముందుగా అనుకున్న ముహూర్తం ప్రకారం నితిన్ వివాహం ఏప్రిల్ 16న దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగాల్సి ఉంది. 

కానీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్న దేశాల్లో దుబాయ్ కూడా ఒకటి. దీనితో అక్కడ పెళ్లి సేఫ్ కాదని నితిన్ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా భారీ సంఖ్యలో జనాలు పోగయ్యేలా మ్యారేజ్ ఈవెంట్స్ సరికాదని, కరోనా ప్రభావం దృష్ట్యా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. 

ఒకవేళ దుబాయ్ లో కుదరకపోతే హైదరాబాద్ లో అయినా పెళ్లి జరిగేలా ఏర్పాట్లు చేయాలని నితిన్ కుటుంబ సభ్యులు భావించారు. కానీ తాజా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఈ నేపథ్యంలో వివాహం కొంత కాలం వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నితిన్ తన బ్యాచిలర్ జీవితానికి ముగింపు పలికేందుకు మరికొంతకాలం ఎదుచూడాల్సిందే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios