తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఎందరో స్టార్ హీరోలతో సినిమాలు చేశారు నిర్మాత అల్లు అరవింద్. చిరంజీవి, రజినీకాంత్ లాంటి ఒకప్పటి స్టార్ హీరోలతో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ లాంటి ఈ తరం హీరోలతో కూడా ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమకి గాను అల్లు అరవింద్ చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం అతడిని సత్కరించింది. సోమవారం నాడు ఢిల్లీలో విజ్ఞానభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన్ను ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ 2019’ అనే పురస్కారంతో గౌరవించారు.

ఆ హీరో మాటలకి కన్నీళ్లు పెట్టుకున్న మెగాస్టార్!

భారతరత్న పురస్కార గ్రహీత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ అవార్డుని అందించారు. సమాజ సేవ చేస్తూ, సామాజిక అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులకు ఈ పురస్కారం ఇస్తారు. అల్లు అరవింద్ తో పాటు నలుగురు ముఖ్యమంత్రులు, క్రీడాకారులు, మరికొందరు ప్రముఖులకు ఈ పురస్కారం అందించారు.

జస్టిస్‌ కె.జి. బాలకృష్ణన్‌, జస్టిస్‌ జ్ఞానసుధ సుభ్యులుగా ఉన్న జ్యూరీ అల్లు అరవింద్ కి ఈ పురస్కారం అందివ్వాలని నిర్ణయించింది. ఇటీవల అల్లు అరవింద్ నిర్మించిన 'అల.. వైకుంఠపురములో' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకుంది.