తెలుగువారికి వరి అన్నం తినిపించిందెవ్వరు?
ఆ మధ్య, రాయలసీమ వారికి వరి అన్నం తినిపించింది ఎన్టీఆరే నని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అని చాలా వివాదం తీసుకువచ్చారు. అయితే,అసలు వరి అన్నం తింటున్న తెలుగువాళ్లంతా స్మరించుకోవలసిన వారెవరు?
తెలుగు వాళ్లందరికి మొదటి కవిసార్వభౌముడు శ్రీనాథుడు (1365–1441). తెలుగు సాహిత్యములొ ప్రబంధ ప్రక్రియను జనప్రియం చేసిన సుప్రసిద్ధ కవి. ఆయన రోజుల్లో తెలుగువారి ప్రధానాహారం జొన్నలే.
జొన్న కలి జొన్న యంబలి
జొన్నన్నము జొన్న పిసరు జొన్నలు తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ బలినాటి సీమ ప్రజ్అ లందరకున్
***
రసికుడు పోవడు పల్నా
డెసగంగా రంభ యైన నేకులె వడుకున్
వసుధేశుడైన దున్నును
కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్
పల్నాటి సీమలో నీటివనరులు తక్కువగా ఉన్నాయి. అందుకే వర్షాధార పంట అయిన జొన్నలే, ఎంతటివారైనా పల్నాటి ప్రజలకు, ముఖ్య ఆహారము అని శ్రీనాధుడు ఈ పద్యంలో వివరించాడు.
చాలా కాలం కోస్తా పరిస్థితి ఇంతకొంటే పెద్ద భిన్నంగా లేదు. 19 వ శతాబ్ధం మధ్య భాగంవరకూ పల్నాటి సీమలొనే కాక కోస్తా ఆంధ్ర అంతటా వ్యాపించినపై పరిస్థితులు చూసి చలించి పోయాడు ఆర్థర్ కాటన్. అదే సమయములొ కృష్ణ, గోదావరి నదులనుండి లెక్క లేనన్ని నీళ్ళు వృథా సముద్రానికి తరలి పోతున్నది కూడా కాటన్ కి బాధ కల్గించింది.
1840 లొ కృష్ణా, గోదావరి నదులపై, ఆణకట్ట నిర్మాణం గురించి ఈస్ట్ ఇండియా కంపెని అధికారులకు నివేదించాడు. ప్రణాళిక తయారయింది. 1846 లొ ఆమోదం లభించింది. 1847 లొ గోదావరిపై ధవళేశ్వళేశ్వరం లొనూ, 1848లో కృష్ణానదిపై, విజయవాడలొనూ ఆనకట్ట నిర్మాణం పనులు ప్రారంభం, 1852 లొ గన్నవరం అక్విడక్ట్ పనులు ప్రారంభం; ఆనకట్టల నిర్మాణం పనులు పూర్తి. వరిపంట ముమ్మరమయింది.
ఆనాటినుండి వంద సంవత్సరాలు నిరంతరముగా లక్షల ఎకరాలు సస్యశ్యామలముగా రండు/మూడు పంటలు పండుతూ, 1960 దశకములొ నాగార్జున సాగర్ పూర్తి కావడముతొ పల్నాడుతొ సహా కొస్తాంధ్ర ప్రజలు వరి అన్నం తప్ప ఇతరములు చూడనుకూడా లేదంటె అతిశయోక్తి కాదు.
ఈ సందర్భములొ మరవలేని ఒక వ్యక్తి:
తూర్పు, పశ్చిమ గోదావారి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన మహిళ డొక్కా సీతమ్మ. గోదావరి మధ్యస్థంగా కల డెల్టా ప్రాంతములోని డెల్టా గన్నవరం లేదా లంక గన్నవరం అని పిలువబడే ఊరిలో ఇల్లాలుగా ప్రవేశించిన ఈమె ఆ ప్రాంతములలో తరచు వచ్చే వరద , అనావృష్టి, అనావృష్టి కారణంగానూ పలు ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆదుకొంటూ, వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానము జరిపిన మహాఇల్లాలు. 'అన్నమో రామచంద్రా' అన్నవారి ఆకలి తీర్చిన మహా ఇల్లాలు. ఈమె చదువుసంధ్యలు లేని సాధారణ స్త్రీ. ఆమె తాను అన్నదానంచేసి, విశ్వమానవతకు అద్దం పట్టిన మహిళామణి . భారతీయ సాంప్రదాయంలో 'అన్నం పరబ్రహ్మ స్వరూపమ్ ' అని పేర్కొనడం మనం వింటున్నాం. అన్నదానానికి మించిన దానంలేదని విశ్వసించి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా 'అతిథి దేవోభవ' అన్నపదానికి ఉదాహరణగా నిలిచినవ్యక్తి ఆమె. .
కృష్ణా అనకట్ట, నీటి పన్నునుండి ప్రతి సంవత్సరమూ దాదాపు 12 కోట్ళ రుపాయిల నిఖర ఆదాయము ఉండేది. అయినా మద్రాసు ప్రభుత్వంవారు దాని నిర్వహణ నిర్లక్షించే వారు. అది ఆంధ్రోద్యముము ముమ్మరంగా సాగడం మొదలయ్యాక, దానికి తాత్కాలికా మరమ్మతులు కూడామానేశారు. తత్పలితముగా 1952, సెప్టెంబర్, 9 న , కృష్ణా నదిలొమునుపెన్నడూ కని, విని, ఎరగని, వరద రావడముతొ ఆణకట్ట తెగిపోయింది. పర్యపేక్షక (Superintendent) ఇంజినియర్ వేపా కృష్ణమూర్తి తన బలగముతొ హడా హుడిన వచ్చి, మరమ్మతు చర్య చేపట్టారు. ఇసుక సంచిలు, పడవలు అడ్డం వేసె ప్రయత్నములొ వారితొ పాటు, ఇద్దరు జూనియర్ ఇంజనియర్లు, ఆరు మంది కలాసిలు వరదపాలయ్యారు. వారి అస్తికలు కూడా దొరకలేదు. ఈ తరుణములొ కూడా మద్రాస్ ప్రభుత్వం వారు. చలించలేదు; మానవత్వం పోగొట్టుకొన్నారు. ఆంధ్ర రాష్ట్రం ప్రకటన కావడముతొ, ఆస్తి పాస్తిల విభజనలొ, లెక్కలు మార్చి ఆణకట్టవల్ల రు 2.20 కోట్ల నష్టం చూపించారు.
అక్టోబర్, 1,1953 న కర్నూలులొ ఆంధ్ర ప్రభుత్వం ఏర్పాటవ్వగానే, మంత్రి వర్గం కృష్ణ ఆనకట్ట మరమ్మతుపై దృష్టి సారించింది. మరమ్మతుకంటె పునర్నిర్మాణమే శరణ్యం అన్న విజ్నుల అభిప్రాయాన్ని మన్నించింది. నివేదికతొ, ప్రణాళిక, ఆర్థిక, న్యాయ మరియు శాసన సభా వ్యవహారల మంత్రి, ప్రకాశం గారి అనుచరుడు, తెన్నేటి విశ్వనాథం ఢిల్లీలో దాదాపు 15 రూజులు బసచేసినా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు విటి కృష్ణమాచారి గారి మొండి వైఖరివల్ల ఎలాంటి సహాయమూ దొరకలేదు. కోపించిన ప్రకాశంగారు తెన్నెటిగారిని వాపసు పిలిపించి, రాష్ట్ర నిధులతోనె మూడు కొట్ళ రుపాయిలు కేటాయించి, నీటి పారుదల శాఖ్యామాత్యులు నీలం సంజీవ రెడ్డిగారితొ ఆణకట్ట పునర్నిమాణ కార్యక్రామానికి సన్నద్ధంకావలిసినదిగా ఆదేశించారు. సంజీవ రెడ్డిగారు ఫిబ్రవరి 13, 1954న ప్రకాశంగారిచే శంకు స్థాపన తేది నిర్ణయించారు.
ఒక చిన్న మలుపు. విజయవాడ - గుంటూరు రాజధాని కావాలని పట్టుబట్టిన కోస్తా నాయకుల అభిప్రాయానికి, హితాసక్తికి భిన్నంగా, ముఖ్యమంత్రి ప్రకాశంగారు, కర్నూలును రాజధానిగా ఎన్నుకొన్నారు.
కొస్తాలొ ప్రతిఘటన తారక స్థాయికి చేరింది. విజయవాడలొ వారి విగ్రహాన్ని పడగొట్టారు. దానికి స్పందించిన ప్రకాశంగారు: "నేను పెట్టమనలేదు; గొట్టమనలేదు. వారే పెట్టారు; వారే గొట్టారు. పెట్టిన వారికి గొట్టె హక్కు ఉన్నది. దానిని వారు చలాయించుకొన్నారు. ఏడ్చారులే". అంటూ, ఏమీ జరుగనట్ళు తన స్థిత ప్రజ్ఞతను ప్రదర్శించారు.
అలనాటి ఆంధ్ర రాష్ట్రం పదకొండు జిల్లాలలొ రాయలసీమా నాల్గు, మరియు నెల్లూరు తప్ప మిగతా ఆరు జిల్లాలకు గుంటూరు విజయవాడల మీదనే పయణించాలి. అది హెలికాప్టర్ సంస్కృతికి మూడు శతాభ్ధాల ముందు యుగం. ఫి. 13, 1954న ప్రకాశంగారు కృష్ణా అనకట్ట శంకు స్థాపనకు వస్తున్న తరుణములొ అందరూ గొడవ ఊహించారు. ప్రభుత్వం శాంతి భద్రతల విభాగమువారితొ సహ, వారిని, శంకు స్థాపన సాంకేతిక సిబ్బందికె వదలి పెట్టి ఉద్ఘాటనోత్సవానికి హాజరైతె మేలు అని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
"తిట్తారా? కొట్తారా? ఇన్ని రాళ్ళ రాశులు ఏర్పాటు చెయ్యండి. పాపం వారు వాటిని వెతుకుతూ సమయం వృథా చెయ్యడం నాకు ఇష్టం లేదు" అన్నారు.
అనూహ్యముగా విజయవాడ సత్ప్రజలు, ముందున్న చిన్న విగ్రహమున్న స్థలములోనే, ప్రకాశంగారి నిలువెత్తు కొత్త విగ్రహాన్ని తయారు చెసి వారక్కడికి వచ్చె సమయానికి ఆవిష్కరణ కూడా గావించారు. అనుకొన్న పద్దతిలొ, నిర్ణయించిన శుభ ముహూర్తాన మొదలయిన పని అనుకొన్న మార్గములోనే ముమ్మరంగా సాగుతూ ఉన్నప్పడు ఇంకొక గండం ఎదురైయింది.
6-11-1954వ తేది ప్రకాశంగారి మంత్రివర్గం పై విశ్వాస రాహిత్య తీర్మానం పాస్ అయింది. వారి రాజినామాతొ గవర్నర్ గారి పాలన, మధ్యంతర ఎన్నికలు, బెజ్వాడా గోపాల రెడ్డిగారి నాయకత్వంములొ మంత్రివర్గ రచన, తదుపరి 1-11-1956 ఆంధ్రప్రదేశ అవతరణ తెలిసిన విషయాలె. మొత్తానికి నిర్ధరించిన 30 మాసాలు కాక 46 మాసాలలొ పనులు పూర్తి అయి డి.24, 1957 న ఆ నాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన నీల సంజీవ రెడ్డిగారు ఉద్ఘాటించి ప్రజలకు అంకితం చేశారు.
ప్రకాశంగారిని ఉత్సవానికి ఆహ్వానించారో లేదో తెలియదు గాని, వారి అవసానం తరువాత వారికి శాశ్వతమైన స్మారకముగా నామకరణం చెయబడిన, 12 లక్షల ఎకరాలకు, మూడు పంటలకు నీళ్ళందిచ్చె "ప్రకాశం బార్రెజ్" విజయవాడాకు వచ్చే వారందరికి ఆహ్వానం పలుకుతుంది.
ప్రస్తుతం గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏ ఆధునిక సౌకర్యమూ లేని 19 వ శతాబ్ధం మధ్య భాగములొ ఒక విదేశీయుడు, స్థానిక పరికరాలతొ, యాంత్రిక జ్ఞానంతో, మానవ వనరులతొ గొదావరి, కృష్ణా ఆనకట్టలను కేవలం ఐదు సంవత్సరాలలొ కట్టగలిగాడు.
అందుకే జప, తపాదులతో పాటు పిండ ప్రధానం చేసేటప్పుడు, సహృదయులు కొందరు ఈ నాటికీ "నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః
స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం: కాటనాయస్వాహః" అని ఆతనిని స్మరిస్తారు. ఇది విశేషం!
అతి తక్కువ భూసేకరణ. ప్రకృతి దత్తమైన వాగులు, వంకలు, కాలువలను ఉపయోగించుకొవడం. వంద సంవత్సరాల పాటు ప్రత్యెకమైన మరమ్మతులు లేక సాగింది. సరియైన పోషణ ఉండి ఉంటె, 1952 లోనూ కూలి పోయేది కాదేమో! 1954-57 నిర్మాణ సమయములొ ఈ నాడు ఉన్న సాంకేతిక పరిజ్నానము, సానుకూలతలో కేవలం 10% మాత్రమే గలదు. 2009 అక్టొబర్ మొదటి వారములొ సామర్థ్యాన్ని మించి 15,00,000 క్యూసెక్స్ ల నీళ్ళు దాదాపు ఐదు రోజుల పాటు పారినా చక్కచదరలేదు. ఇంకా ఎన్నో విస్మయాలు!!
ఇవియే కాదు. నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రా నంగాల్, హిరాకుడ్ ...లెక్క లేనన్ని కేంద్ర ప్రభుత్వం కర్మాగారాలు, ఉక్కు పరిశ్రమలు, నిర్మించి సాహసం నిరూపించుకున్న మన ఇంజనీర్లు అమరావతి నిర్మాణం చెపట్టలేరా? కట్ట లేరా?
పట్టి సీమ, హంద్రి నివా, గొల్లపల్లి, ముచ్చుమర్రి, కొన్ని వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందించేవి. దానికి ఎంత ఆర్భాటం. ప్రచారం!!
ఆ నాడు కేంద ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారమూ లేకుండానె కృష్ణా ఆణకట్ట పూర్తి. ఇప్పటికయినా పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిర్మాణానికి ముందుకు వచ్చింది. పది సంవత్సరాల తరువాత కూడా ఫొలవరం, ప్రాణహిత్ - చెవెళ్ళ ఇంకా భూసేకరణ తగాదాలు, పొరుగు రాష్ట్రాలతొ వివాదాలు తెగలేదు.
ఒకమారు ఆలోచించండి. ఇలాంటి పరిస్థితిలొ, నాగార్జున సాగర్, శ్రిశైలం కలలుగానే మిగిలేవి కదా?
ఒక చిన్న ఉదాహరణ. కర్నూలు జిల్లా సంఘమేశ్వరం దగ్గర "సిద్దేశ్వరం అలుగు" పేరుతొ 450 మీటర్ పొడువున, కేవలం 600 కోట్ళ ఖర్చుతో నిర్మిస్తే, ప్రతి సంవత్సరం 80 శతకోటి ఘన అడుగుల (TMCFT) నీరు నిల్వ వుంటుంది. ఒక శతకోటి ఘన అడుగులు 10,000 ఎకరాల చొప్పున లెక్క వెయ్యండి; ఎన్ని ఎకరాలు సాగు?. ఇది కరువు కాటకాలకు గురియైన రాయలసీమ ప్రజల దతాబ్ధాలనాటి కోరిక. ఆ సుందర వలయం ప్రకృతి వారికి దయదలచిన, కరుణించిన వరం. బాధ కలిగించే విషయము: ఇంతకు ముందు పరిపాలకులంతా బలహీనులు, ఏమీ చెయలేదు, నిరర్థక నాయకత్వం; అంటూ ఆపాదించడం. వారు ఏమీ సాధించలేదులే. మీరెందుకు పూనుకో కూడదు?
వాస్తవం: ప్రకాశం బ్యారెజ్ ఉన్నందుకు కాదా? పట్టి సిమ సాధ్యమయింది. శ్రీశైలం కట్టినందువల్లనె హంద్రి - నీవా; గాలేరు -నగరి; శ్రీశైలం కుడికాలువ, తెలుగు గంగా, కె.సి.కాలువ స్థిరీకరణ కదా? మన ఆశ: Rome is not built in a day.
"అమరావతికి కీర్తి కిరీటం, ప్రకాశం బ్యారెజ్" అన్న ముఖ్యమంత్రిగారి అభిమానం అభినందనీయం. ఐతె దాని నిర్మాతకు తగిన స్మారకాలు లేని లోపాన్ని సరిదిద్దాలి గదా!
రాష్ట్ర సెక్రెటేరియట్ కీ "ప్రకాశం భవనం" పేరు సబబు కదా! ఆనాడు ప్రకాశంగారు "వాడి, ఆ వేపాకృష్ణమూర్తి గాడి ఆత్మకు శాంతి కలగాల్రా" అంటూ ఆనకట్ట పునర్నిర్మాణమ్ పట్టు బట్టారు. పూర్తి దశకు వచ్చిన రోజు వారే అధికారములొ ఉండి ఉంటే దానికి వేపా పేరు పెట్టెవారెమో? ప్రస్తుతం "పట్టి సీమ" కైనా "వేపా కాలువ" అనె పేరు పెట్టచ్చుగదా?
ఏది ఏమైనా జొన్న అంబలి మాని, వరి అన్నానికి మనకు దారి చూపిన పూర్వికులను విమర్శించడం కృతజ్నతా? కృతఘ్నతా? ఈ రోజు కవి సార్వభౌముడు లేచి వస్తె ఏమంటాడొ?