Asianet News TeluguAsianet News Telugu

ఇది ఊపు,రూపు లేని బడ్జెట్...

jaitelys post demonetization budget belied hopes

వాస్థవానికి 2017 ''18 బడ్జెట్, ప్రస్తుత ప్రభుత్వానికి చాలా ప్రాముఖ్యమైనది. వచ్చే సంవత్సరం, 2018-'19 మాత్రమే ప్రతిపాదన ఉంటుంది. 2019 మే నాటికి ఎన్నికలు. ఎన్నికల నియమావళివల్ల బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉండదు. 

 

          అన్ని విధాలుగా వివాదాస్పదమయిన పెద్ద  నోట్ళ  రద్దు, బి.జె.పి. ప్రభుత్వం సాధించిన సాహసోపేత చర్యగ.  అందువల్ల దేశమంతటా  2017-'18 బడ్జెట్  కి విప్లవాత్మకమైనదిగా కాంక్షిస్తూ నిరీక్షించింది. అది నిరుత్సామనే చెప్పాలి. ఇది ఒక తంతుగా గడిచింది తప్ప,  ప్రత్యేకమైన ఒక యజ్ఞమని అనిపించడం లేదు.

 

 కొన్నివిశేష ప్రకటనలు ఉన్నా,  అలాంటివి ప్రతి బడ్జెట్ లొ ఉండడం సహజం. ఈ సంవత్సరం కూడా అంతే. భవన నిర్మాణ పరిశ్రమ  నోట్ళ విలువల రద్దువల్ల అత్యంత నష్ట పోయిన రంగం. ప్రస్తుతానికి స్తబ్ధు పోయింది. దానికి కంటి తుడిపు కూడాకూడా లేదు. గృహ నిర్మాణ బ్యాంక్ కి ప్రకటించిన సహాయం పరిశ్రమానికి చేరుతుందా? చేరితె, ఎప్పుడు?  2014 ఎన్నికల ప్రచారములొ పోటెత్తిన, కొండంత ఘోరంతగా చూపించిన స్విస్ బ్యాంక్ నిధులు,  సైనికులకు ఒక హౌదా-ఒకె విశ్రాంత వేతనం ఊసే లేదు. అది ఒక శుష్క వాగ్ధానం; చెత్త కాగితముగానే మిగిలి పోయింది.

 

 

ఎంతో ఆశతొ సమస్త దేశం, ప్రజానికం ఎదురు చూస్తున్నది రాజ్యాంగ 73, 74 వ సవరణల అమలు. స్థానిక సంస్థలకు అధికారం బదలాయించే దిశగా ఆ చట్టాలు చెయబడినవి. అవి గ్రంథాలయాలలో బూజు పట్టి పొయినవి. గ్రామీణ ప్రాంతాలకు కొన్ని రాయితీలు సంపద కేటాయించినా అవి స్థానిక సంస్థలకు ఇవ్వరు. అలా ఇస్తే సంస్థ మరియు విధాన సభ సదస్యుల పెత్తందారి జరుగదు కదా?

 

 

గ్రామీణ ప్రాంతాలలొ 1,50,000 అంతర్జాల కనెక్షన్లు సబబైన నిర్ణయం.  వ్యవసాయ రంగానికి పది లక్షల కోట్ళ సహాయం. ఈ మొత్తాన్ని రైతులు పెట్టుబడిదారుల చేతిలొ నలిగి పోకుండా పంట పండినప్పుడు రైతులనుండి పంటలను కొనుగోలు చెయ్యడానికి ఉపయోగించాలి.  రైతులు ఆశించేది వాళ్ళు పండిన పంటకు మద్దతు ధర.. ఒక రైతుకు తప్ప మిగిలిన అన్ని ఉత్పత్తిదారులకు వారి సొత్తుకు ధరలు నిర్ణయించే అధికారం వాళ్ళకె ఉంటుంది. ఐదు సంవత్సారలొ రైతుల ఆదాయం రెండింతలు పెంచడం ఒక లక్ష్యం.  ఐతె అప్పటికి ద్రవ్యోల్బణంవల్ల వాటి విలువ ఎంత ఉంటుందో? ధరల పెరుగుదల ఉన్నప్పుడు, నియంత్రణ కొరకు విదేశాలనుండి దిగుమతి చేస్తారు. ఎగుమతిని నిలిపివేస్తారు. ఇక్కడ పంటలు రహదారి మీద వేసినప్పుడు అడిగే దిక్కుండదు. 

 

                     వాస్తవమే: ప్రాథమిక విద్యాభ్యాసం, ప్రాథమిక ఆరోగ్యం రాష్ట్ర పభుత్వాల భాద్యత. అయితే వాటికి చెయూతనిచ్చి, ప్రభుత్వ రంగ వ్యవస్థలను బలపరచవలసిన అవసరాన్ని ఈ బడ్జెట్ గుర్తించలేదు. ఆటల పోటిలలొ గెలిచి పతకం సంపాదించినవారికి కోట్ళు ధారాదత్తం చెయ్యడం తప్ప కొత్తవారికి ప్రోత్సాహం ఎక్కడిది? ప్రత్యక్ష పన్నులొ ఇచ్చిన రాయితిలు పేరుకుమాత్రమే. జనాబాలొ కేవలం రెండు శాతంకంటె తక్కువ మంది మాత్రమే పన్నుచెల్లించెవారు ఉన్నారంటె, లోపమెక్కడ ఉన్నది? అంతకంటె ఎక్కువ కార్లు ఉండడం తెలిక మాటనా?

 

 

నాబార్డ్ తొ సహకార బ్యాంక్ ల అనుసంధానం స్వాగతార్హం. గుజరాత్, జార్ఖండ్ లలొ అఖిల భారతీయ వైద్యశాస్త్రాల సంస్థ స్థాపన మెచ్చుకొదగినది. వైద్య కళాశాలలొ సీట్ళను పెంచడం అత్యవసరం. ఇప్పుడు ఉండే కళాశాలలొ ఉపాద్యాయ - విద్యార్థి నిష్పత్తి తగినంత లెదని సీట్ళు తగ్గిస్తున్న ఉదంతాలు ఉన్నాయి.

నల్లధన నిర్మూలన :అవిభక్త భారత దేశములో లియాఖత్ ఆలి ఖాన్, (1946 -'47) తరువాత స్వతంత్ర భారతపు మొదటి ఆర్థిక మంత్రి శణ్ముఖన్ చెట్టి (1947-'49) మొదలు ఈ నాటి జైట్లి వరకు జపిస్తున్న మంత్రం. కొత్తేముంది ఇందులో.

 

తస్మాత్ జాగ్రత:  జాతీయ రహదారులకు కేటాయించిన 67,000 కోట్ల కంటె ఎక్కువ మొత్తాన్ని రహదారి, టోల్ గేట్ పన్నులు వసూలు చేస్తున్నారు.

 

 

ఇది హస్యాస్పదం:  రాజకీయ పక్షాలకు విరాళం పరిమితి రు 2,000/- హస్యాస్పదం. ఒక వోటుకి కూడా సాలదు!! "పన్ను ఎగవెతదారులకు హెచ్చరిక" "నల్లధన నిర్మూలన" అవిభక్త భారత దేశములొ లియాఖత్ ఆలి ఖాన్, (1946 -'47) తరువాత స్వతంత్ర భారతములొ మొదటి ఆర్థిక మంత్రి శణ్ముఖన్ చెట్టి (1947-'49) మొదలు ఈ నాటి జైట్లి వరకు జపిస్తున్న మంత్రమిది. హరిజన, గిరిజన, అల్పసంఖ్యాక వర్గాల కేటాయింపులు పెంచడం స్వాగతార్హం.

 

 

 విశ్వవిద్యాలయం అనుసంధాన సమితిని (UGC) పునరుద్ధరణకు  ముందు ప్రభుత్వ కళాశాలలొ, విశ్వ విద్యాలయాలలొ ఉన్న ఖాళీలను భర్తి చెయడానికి రాష్ట్రప్రభుత్వాల పై ఒత్తిడి ఎంతో అవసరం. ఉదా: కర్నూలు రాయాసీమ విశ్వవిద్యాలయములో  11 మంది శాశ్వత అధ్యాపకులు ఉండగా  40 పైన తాత్కాలిక అధ్యాపకులు.  పాడి పరిశ్రమల అభివృద్ధికి కేటాయించిన, 8,000 కోట్ళమొత్తాన్ని గోరక్షణకొరకు కూడా ఒక అవకాశముగా భావించాలి.   వృద్ధ నాగరీకులకు (Senior Citizens) జీవిత భిమా సంస్థ ద్వారా 8 % వృద్యాప్య వెతనం కార్యగతం అయినప్పుడు అనుభవిస్తాము. 

  

            ఆంధ్ర ప్రదేశానికి వస్తే, అమరావతిలొ, 22,000 ఎకరాల యజమానులు,  కొన్ని వేలమంది రైతులకు,  మాత్రమే ఉపశమనం; ఆస్తి విలువల పెంపుదల పన్ను(Capital gain tax) నుండి మినాయింపు. రైల్వె ప్రతిపాదనల వివరాలు తెలియవు. ప్రయాణ ధరల పెంపుదల లేనట్టే అనుకొవచ్చా? చాలా ఆశించాము. ఉదా: కర్నూలు  మంత్రాలయం లైన్ నిర్మాణం. 3,500 కి.మీ. లొ ఉన్నదా?  నడికుడి శ్రీ కాళహస్తి నిర్మాణం పూర్తి. రాయలసీమానుండి, ప్రత్యెకముగా, కర్నూలు, కడపనుండి అమరావతికి నేరుగా ప్రయాణం. కర్నూలులొ స్థల సేకరణ కూడా జరిగి స్థగితముగా ఉన్న్ రైలు పెట్టెల రిపేరి/ నిర్మాణ కర్మాగారన్ని నిర్మిస్తారా? 

 

ఇంతకు నోట్ల రద్దు విజయం సాధించామంటున్నారే గాని ఆ లెక్కజమ  గురించి ఒక్క మాట లేదు. ఆ ఛేదు అనుబవముతోనే బడ్జెట్ ఊపు తగ్గిందా?      

  

గాంధీజీ 150 జయంతి, సబర్మతి ఆశ్రమం శతమానోత్సవం చిత్త శుద్ధితొ జరుగుతుందని ఆశిస్తాం