గృహభంగం : ఈ నవలలో ఎముంది?
అవును ఆ నవలల్లో ఏముంటుంది?
సరైనవాళ్లు రాస్తే జీవితం ఉంటుంది.
సమాజంలోని అన్ని వర్గాలజీవితాలు ప్రతిఫలించకున్నా సమాజాన్ని కొంతైనా అర్ధం చేసుకోవచ్చు.
ఆవిడో పదిసూర్యకాంతాల పెట్టు.పేరు గంగమ్మ.ఒక కరణం భార్య,ప్రస్తుతం విధవరాలు.ఇద్దరు కొడుకులతల్లి.కొంపకొంపంతా ముం*,లం*,నీ రంకుమొగుడు,నీయమ్మను* పదాలు యదేచ్చగా వాడేస్తుంటారు.
బడికిపోండిరా బడుద్దాయిల్లారా అంటే కొంపమీద పెంకులు పగలగొట్టారు,బీడీలు కాల్చి చెరుకుతోట కాల్చారు.నష్టపరిహారం చెల్లించాలన్న ఊరితీర్పును అనుసరించి పొలం తాకట్టుపెట్టి చెల్లించింది.చిన్నోడు అప్పణ్ణకు చదువేలేదు.పెద్దాడు చెన్నిగరాయన్ని కరణం లెక్కలు నేర్చుకోవాలని పట్నం పంపింది.అయినా మనోడి బుర్ర అంతంతే.ఆ పక్కగ్రామంలో ఉన్న నంజమ్మతో పెళ్లయింది.
ఈవిడ నాన్న జ్యోస్యా భట్లు ఒక eccentric character.ఊరిబయట జనాలకు జెల్లకొట్టి ఒక ఆచారి గ్రామదేవట మట్టిబొమ్మలో నాణేలుంచి చేయించి పూజలు జరిపి డజన్లకొద్దీ అరటిపళ్లు పెట్టించి పూజలు చేస్తే మన నంజమ్మ తండ్రి నడిరేయి ఆ విగ్రహాలను పగలగొట్టి ఆ నాణేలు,పళ్లు తీసుకునే రకం.మొత్తానికి పెళ్లయ్యక నంజమ్మ వ్యక్తురాలైంది,కాపురానికొచ్చింది.
ఇక జ్యోస్యా భట్టు పోలీస్ గా పనిచేస్తున్న తన కొడుకును పంపి పాతకరణం పోయాక కరణంగిరీ చేస్తున్నాయన్ను బెదిరించి అల్లుడు చెన్నిగరాయను కరణం చేసాడు.మన సన్నాసి,సోంబేరి,సోమరికి అంత తెలివెక్కడుంది.కూలికి మరో కరణాన్ని తెచ్చుకున్నాడు.ఈయన అంతోఇంతో చదివిన నంజమ్మకు లెక్కలు నేర్పించాడు.ఇక తమ్ముడు అప్పణ్ణకూ సావిత్రి/సాతు తో పెళ్లయింది.ఈవిడో పురోహితుడికూతురు.నంజమ్మలా నానా తిట్లు తిడితే పడేరకం కాదు.ఇద్దరు కోడళ్లకూ పిల్లలు పిల్లలు కలిగారు.సాతు బాధ భరించలేక పుట్టిల్లు చేరింది.
ఈ నవలలోని ప్రధాన పాత్రలివి. ఇక ప్రధాన సంఘటనలు నాలుగు సార్లు ప్లేగ్ వ్యాధిరావడం
నంజమ్మ సొంత ఊరిలో ప్లేగ్ వ్యాధి వచ్చింది.ఊరంతా గ్రామం ఖాళీ చేసి ఊరిబయట షెడ్లకు తరలిపోయారు.జ్యోస్యా భట్టు ఖాళీ చెయ్యలేదు.ఆయనంటే సరిపడని వ్యక్తి బెదిరించాలని ఇంటిమీద రాళ్లేయించాడు.ప్లేగ్ తగ్గాక అందరూ ఇల్లు చేరాక ఆరాళ్లేయించినోడి కొంప మీద పెంకులు పగులగొట్టాడు.కోర్ట్ కేస్ అయింది,సాక్షాలు లేక కొట్టేసారు.బయటికొచ్చాక కేస్ పెట్టినోడిమీద కసితీరక చావగొట్టాడు.వాడు చచ్చాడనుకుని పరార్ అయ్యాడు.
ఈలోగా కొడుకుంటున్న ఊర్లో ప్లేగ్ వచ్చి చేయి పనికిరాకుండాపోయి పోలీస్ ఉద్యోగం పోయింది.ఈ కొడుకు భార్య అంటే నంజమ్మ వదినా మరో సూర్యకాంతమే.
ఇక్కడ ఒక కోర్ట్ పక్షి రేవణ్ణ మాటలు విని తాకట్టులో ఉంచిన పొలాలు,ఇల్లు కోల్పోతారు గంగమ్మ కుటుంబం.ఊరి చివర గుడి ప్రాంగణంలో ఉంటారు.పక్క ఊరు గౌడ గారి ఆసరాతో నంజమ్మ వారుంటున్న ఊరిలో వారి ఖాళీ ఇంట్లో కాపురం ఉంటుంది.
రెండోసారి ప్లేగ్ వచ్చినప్ప్పుడు ఊరంతా తీవ్ర దుర్భిక్షానికి తోడు ఇదీ...ఎండిన చెరువులో ఏవో గడ్డలు తవ్వి తెచ్చుకు తింటారు,నానారకాల తినగలిగే ఆకులు తింటారు...గజ్జిలాంటి చర్మవ్యాధుల బారిన పడతారు.
నంజమ్మ చదువుతున్న బడిలో మందులిచ్చి బాగు చేసినా అప్పటి నమ్మకాలను అనుసరించి గ్రామదేవతకు ముక్కుబడి ముక్కుకుంటారు.నంజమ్మ అత్త,మరిది ఊర్లమీద పడి ధాన్యం బిక్షగా తెచ్చుకుని ఒక గుడి మండపంలో బతికేస్తుంటారు.కుటుంబం పట్టని భర్త,ఉన్న ముగ్గురుపిల్లల ఆకలి తీర్చాడాని కరణీకంతో పాటూ విస్తర్లు కుట్టి జీవనం సాగిస్తుంది నంజమ్మ.అయినా సమాజం బతకనిస్తుండా?
నెలలో ఆ మూడురోజులు మైలపాటించకుండా వంట చేస్తుందని అగ్రహారీకులకు కోపం.ఇక మరిది భార్య సాతు తండ్రి మరణించగా తల్లితో,వడిలో పిల్లల్తో ఊరుచేరుతుంది.అమ్మకు తెలియకుండా అత్తారింటికి పోయి అప్పణ్ణ చేసిన ఘనకార్యమే ఆ పిల్ల.తల్లిమాటలు విని భార్య తాళి తెంచుతాడు.
సాతుకు కొన్నాళ్లపాటూ నంజమ్మ ఆశ్రయమిస్తుంది.సాకు దొరికిన కులపెద్దలు వెలివేస్తారు.అయినా లెక్క చేయని నంజమ్మ బాగా చదువుకుంటున్న పెద్దకొడుకు మీద ఆశలు పెట్టుకుని ఉంటుంది.ఇక కూతురికీ భార్య చనిపోయిన ఒక మంచి ఉపాధ్యాయుడిని చూసి పెళ్లి చేస్తుంది.ఆనాటి ఆచారం ప్రకారం అమ్మాయికి వ్యక్తురాలు కాకముందే పెళ్లి చేయాలి కాబట్టి అబద్దం చెబుతుంది.ఆ తర్వాత కొన్నాళ్లకు అమ్మాయి వ్యక్తురాలైంది కాపురానికి తీసుకుపొమ్మని అల్లుడికి కబురు చేస్తుంది.
ఎప్పుడో ముక్కుకున్న మొక్కు తీర్చేందుకు గ్రామదేవత ఆలయానికి వెళతారు...ఇక్కడ మొదలవుతుంది మూడో ప్లేగ్...పెద్దకొడుకు,కూతురూ ఇద్దరూ మరణిస్తారు...ఇదే సమయంలో కోర్ట్ పక్షి రేవణ్ణ డబ్బుకోసం కూతుర్ని మళయాళీ వ్యాపారుడికి తారుస్తాడు.కడుపొచ్చిన ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది.ఇక పట్నం చేరిన సాతు ఒక పెద్దమనిషికి ఉంపుడుగత్తెగా స్థిరపడుతుంది.
చిన్నకొడుకును చదివించూకుంటూ ఉంటుంది నంజమ్మ.ఆ అల్లరి పిల్లాడు ఒకరోజు పామును కొడతాడు,అది పగబడుతుందని తన అన్న ఇంటికి చేరుస్తుంది.ఇక్కడ ఒక ఇల్లు కొని దానికి పెంకులకోసం పక్క ఊరి కుమ్మరి దగ్గరికి పోతుంది.అక్కడ ఈవిడకు ప్లేగ్ సోకుతుంది.చివరకు కొడుకు వచ్చేలోగానే మరణిస్తుంది.
కథ ప్రారంభం నుంచి వీరి కుటుంబానికి మంచీచెడ్డా చెప్పే ఆత్మీయుడు ఒకరుంటాడు.ఆ ఊరి అలయంలో ఉండి భిక్షాటన చేసుకునే ఒక సాధువు.అప్పటికి ఆ ఊరొచ్చి 35 ఏళ్లైఉంటుంది...జీవిత చరమాంకంలో ఉన్న అతను చివరికి ఒక నిర్ణయం తీసుకుని నంజమ్మ పుట్టింటికి వెళ్లి ఆవిడ కోరికప్రకారం ఆవిడ కొడుకును ఉన్నత చదువులు చదివించి,వ్యక్తిత్వం ఉన్నవాడిగా తీర్చిదిద్దాలని తనతో తీసుకుని వెళ్లిపోతాడు.
ఇవన్నీ 75 ఏళ్ల క్రితం గ్రామాల్లో జనం అనుభవించిన కరువుకాటకాలు,రోగాలు,నాటి సాంఘిక కట్టుబాట్లలో నలిగిన మన పెద్దల కథలే.
ఆ మధ్య కొన్ని దాశాబ్దాల క్రితం ఈ ప్లేగ్ గుజరాత్ లోని సూరత్ లో కనిపించింది...ఈ ఒక్కరోగమేనా అప్పట్లో ఎన్నో రోగాలు మానవాళిని వణికించాయి...అమ్మవారు/మశూచి,కలరా,పోలియో...ఎన్నెన్నో...మశూచిని చాలా ఏళ్ల క్రితమే సమూలంగా నివారించాము..పోలియో కూడా దాదాపు అంతే. ఇక కలరా వ్యాధి వస్తే మన రాష్ట్రంలో కూడా గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోయేవారు....
ఈ కలరాను రాయలసీమలో ‘దూమ్’ తగలడం అంటారు...నేటికీ గ్రామాల్లో కోపమొస్తే నీకు ’దూమ్ తగలా‘ అనే తిట్టు తిడతారు...
అద్భుతమైన ఈ నవల రచయిత భైరప్ప నిజజీవిత సంఘటనలు అంటారు...భైరప్పగారి ఈ నవల National Book Trust లో దొరుకుతుంది..వీరి దాటు,పర్వ నవలలు తెలుగులో సాహిత్య అకాడమీలో దొరుకుతాయి..వీరి అనేక నవలలను ఇంగ్లీష్లో అనువదించారు.
అద్భుతమైన ఈ నవలను ఆనాటి సామాజిక జీవితానికి దృశ్యరూపం కల్పిస్తూ దర్శకుడు గిరీష్ కాసరవళ్లి టీవీ సీరియల్ గా తీసాడు...ఈ ధారావాహిక నిర్మాత నటి సౌందర్య.