‘నోబెల్’కు ముందు చేయాల్సిందేంతో ఉంది
రాయలసీమా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వై.నరసింహులు(కుడి ఫోటో) అభిప్రాయం ప్రకారం కర్నూలులోని విద్యా సంస్థలు ఇతర వాటికంటే , ప్రైవేట్ యాజమాన్య సంస్థలకు కంటే దీటుగా, ఉన్నాయి. ఇది విశేషం. ఇతర ప్రదేశాలలలో సీట్లుభర్తికాక తడబడుతూ ఉంటే, ప్రతి సంవత్సరం ఇక్కడి సంస్థలు కనీసం 25% అభ్యర్థులను వెనక్కి పంపించాల్సివస్తున్నదని అక్కడి ప్రధానాచార్యులు భాదపడుతుండటం దీనికి సాక్ష్యం. ఈ సంస్థలలో చదువిన ’ఎందరో మహానుభావులు’ రాష్ట్ర, జాతీయ, అంజర్జాతీయ స్థాయిలలొ ఖ్యాతి గడించారు. వీటిని నిర్లక్ష్యంచేయకుండా, ముఖ్యమంత్రి ఆశయమయిన నోబెల్ బహుమతి స్థాయికి తీసుకురావలసి అవసరం ఉంది. దీనిని నొక్కి చెప్పేందుకు కర్నూలు విద్యాసంస్థలు గురించి చెప్పాల్సివస్తున్నది.
ఈ సంస్థల చిరుపరిచయం:
పరిపూర్ణమైన ఉన్నత శిక్షణాన్నిఅందరికి అందించే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2008లో కర్నూలు నగర పోలిమేరలొ "రాయలసీమ విశ్వవిద్యాలయం", స్థాపించింది. కర్నూలు జిల్లాలొని అన్ని కళాశాలలు దీనికి అనుబంధంగా ఉన్నాయి. ఇక్కడ మద్రాస్, ఆంధ్ర, శ్రీ వేంకటేశ్వర, శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న సంస్థలు కూడా ఊండడం విశేషం. ఆచార్య నరసింహులుని ఎప్రిల్, 2015 లొ మూడవ ఉపకులపతిగా, రాయలసీమా విశ్వవిద్యాలయం సిబ్బంది, ఉత్సాహముతొ విద్యార్థులు స్వాగతం పలికారు. ఆశించిన విధంగా నరసింహులుగారు తనదైన శైలిలొ విశ్వవిధ్యాలయ ఆవరణములొ ఒక విద్యార్థిఅనుకూల వాతావరణం సృష్టించడములొ కృత కృత్యులైనారు.
1858 లొ స్థాపించబడ్ద దామోదరం సంజీవయ్య స్మారక పురపాలకోన్నత పాఠశాల, జిల్లాలోనే కాదు, తెలుగురాష్ట్రాలలో మొదటి తరానికి చెందిన విద్యాసంస్థ. జాతీయ, అంతర్జాతీయ సంస్థలలొ సేవలందించి దేశానికి కీర్తి తెచ్చిన డా. ఆర్కాట్ రామస్వామి, లక్ష్మణస్వామి ముదలియార్ కవలలు; ప్రథమ స్వాతంత్ర సేనాని, గాడిచర్ల హరిసరోత్థమ రావుగారు; మద్రాస్ పబ్లిక్ సర్వీస్ కమిశన్ అధ్యక్శులు, డా. అబ్దుల్ హక్ తెలుగు సాహిత్యం నవవైతాళికుడు, సురవరం ప్రతాప రెడ్డిగారు; రాజ్యాంగ సభ సభ్యుడు, సర్దార్ నాగప్ప, దేశములొనే మొట్ట మొదటి దలిత ముఖ్యమంత్రి, కవిసామ్రాట్ విశ్వనాథ వారిచే మహా మేధావి అనుపించుకొన్న దామోదరం సంజీవయ్య, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కోట్ళ విజయభాస్కర్ రెడ్డి; విజ్నాని, పల్లె రామారావు; మాజీ ఉపకులపతి డా.కేశవ మూర్తి, ఆచార్య కృష్ణా నాయక్, తదితరులు కర్నూలు మునిసిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థులే. . ప్రస్తుతం ఇక్కడ 450 విద్యార్థులున్నారు. 1908 స్థాపించబడిన కోల్స్ మెమోరియల్, జిల్లాలొని మూడవ ఉన్నత పాఠశాల.
1070 విద్యార్థి సంఖ్యాబలం గల ప్రభుత్వం జూనియర్ కళాశాల డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతర ఉన్నత శిక్షణనభ్యసించదలచుకొన్నవారికి ఉద్యానవనముగానుండేది,1971 స్థాపించబడ్ద ఈ కాలేజీ ఊరు నడిబొడ్డున ఉంటుంది. 1953లో నగరం రాజధానిగా ఉన్నప్పుడు శాసన సభ్యుల అతిథి గృహం మే కాక, శాసన సభాపతిగారి నివాసం కూడా.
(ప్రిన్సిపాల్, డా.చెన్నయ్య విన్నపం రాష్ట్రములొని అన్నిప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతములొగలవు. దాదాపు ఒక లక్ష మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. వారందరు, వారి కుటుంబములొ, ముదటి తరం చదువరులు. బీదరిక రేఖకు రేఖకు కిందున్నవాళ్ళ సంఖ్య ఎక్కువ. చాలా మంది తల్లిదండ్రులు కరువు కాటకాలవల్ల, ఉపాదికొరకు వలస వెళ్ళుతున్నారు. అందువల్ల వారికి మధ్యాహ్న భోజనం పతకం అమలుపర్చడం అవసరం.)
ముఖ్యమంత్రిగారు మొన్న చేతికి తేనె అంటించినారు; ఆంధ్ర ప్రదేశ్ నుండి నొబెల్ బహుమతి గ్రహితకు కోటి బహుమానం ప్రకటించారు. ఈ మొత్తంయొక్క వడ్డిని వినియోగించి వసతులు పెంచి, ఈ సంస్ధలనువిద్యబోధననెలవులుగామార్చాలి. అపుడే నోబెల్ బహుమతి ఆశయం వైపు మనం ప్రయాణించవచ్చు.
కర్నూలు పురపాలకోన్నత పాఠశాలలొ ఎస్ఎస్ఎల్సి. చదువుకొన్న ఒక విద్యార్థి, 20 వ శతాభ్దం రెండవ దశకములొ, మద్రాస్ (చెన్నై) ప్రెసిడేన్సి కళాశాలలొ ప్రవేశం కోసం అర్జి అడిగితే, అతని సగం చినిగిన బట్టలు చూసి, గుమాస్తా: ఇది రాజకుమారులు చదువుకునే కాలేజి. బిక్షగాళ్ళకు కాదు; అర్జి లేదు; పో ("This is a college meant for Princes and not for beggars, get out; no application.") అని ఘర్జించాడు.
ఎలాగో మహమ్మడన్ కాలేజీకి వెళ్లి, చేరి, చదువు ముగించుకొని, విద్యార్థి వేతనం సంపాదించుకొని ఇంగ్లండ్ వెళ్ళి, ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయమునుండి స్నాతకోత్తర పట్టా, పరిశోధనా పట్టా(P.Hd.) పుచ్చుకొని వచ్చి, ప్రెసిడెన్సి కాలెజీలోనే ఉద్యోగం సంపాదించడమే కాకుండా, కాలేజ్’ కి ప్రిన్నిపాల్ కూడా అయ్యారు.
తాను పుట్టి పెరిగిన ఊరులొ తన తరువాత తరం ఇంత ఇబ్బంది పాలు కాకూడదని, చిత్త శుద్దితొ, దృడ నిర్ణయముతొ దేశ విదేశాలలొతొ పాటు, హైదాబాద్ నిజామ్ నవాబ్ గారితొ రూ.2,00,000, విరాళాలు సంగ్రహించి, 1947 లొ ఉస్మానియా కళాశాలలు స్థాపించి ఎంతొ మంది మధ్య తరగతి వాళ్ళకు విద్యా భిక్షపెట్టారు.
ఆ మేధావియే డా.అబ్దుల్ హక్. ఇది ఆనాటి రాయలసీమలొ రెండవ డిగ్రీ కళాశాల; 1917 లొ స్థాపించబడ్ద అనంతపురం సీడెడ్ కళాశాల మొదటిది.
1953 లొ కర్నూలును రాజధానిగా ఎన్నుకొవడానికి ఒక కారణం ఇక్కడ ఉన్నత శిక్షణ సౌకర్యం ఒక కారణమని మరవురాదు. తరువాత రొజుల్లొ, ప్రత్యేకమైన మహిళా కలాశాల స్థాపించేవరకు ఇక్కడ విద్యార్థినిలకు కూడా ప్రవేశావకాశముండేది.
నవంబర్ 1,1956 న ఆంధ్ర ప్రదేష్ అవతరణ కావడముతొ, రాజధాని కర్నూలునుండి హైదరాబాద్ కి తరలి పోయిన విషయం తెలిసిదే. దీనితో అక్కడి సెక్రెటేరియట్ గా ఖాలి అయింది. ఈ భవనాలలొ కర్నూలు వైద్య కళాశాల ప్రారంభమయింది. జులై, 21, 1956 న 50 మంది విద్యార్థులతొ, కేంద్ర ఆర్థిక శాఖామాతులు టి.టి.కృష్ణమాచారి ఈ కాలేజీని ప్రారంభించారు. కోట్ల విజయ భాస్కర రెడ్డిగారు తరచుగా చెప్పేవారు: "ప్రపంచములొ నేను ఎక్కడి పోయినా, అక్కడ కర్నూలుకు చెందిన రెండు సంస్థల విద్యార్థులు తారసపడతారు. ఒకరు ఉస్మానియా విద్యార్థి, మరొకరు కర్నూలు వైద్య కళాశాలకు చెందిన వారు.
దాత కసిరెడ్డి వెంకట రెడ్డిగారి రు. 2,00,000 విరాళముతొ, రాజభవన్ గా ఉన్న పెద్ద బంగ్లాలో 1958 తె. జులై, 27, న "కసిరెడ్ది వెంకట రెడ్ది మహిళా శాల" (KVR Women's College)ని ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్ది ప్రారంభించారు. 1971లో ఇక్కడ పురుషుల డగ్రీ కాలేజీ ప్రారంభమయింది.. ప్రస్థుతం 1,000 విద్యార్థులతొ 1971 లొనే స్థాపించబడ్ద ఇంకొక సంస్థ, ఎస్.టి,బి,సి. కాలేజి.
బారత స్వాతంత్రం రజతోత్సవ సంవత్సాన్ని పురస్కరించుకొని 1972 లొ పి.వి.నరసింహా రావుగారు ముఖ్య మంత్రిగా, ఉనప్పుడు, విద్యాశాఖ కార్యదర్శి, ఎమ్.వి.రాజగోపాల్ గారి చొరవతొ, కర్నూలు సిల్వర్ జుబిలీ కాలేజీ స్థాపించారు. 2015-16 విద్యా సంవత్సరమునుండి విద్యార్థినిలకు కూడా ప్రవెశ సౌకర్యం కల్పించారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్ట ప్రకారం పది సంవత్సరాలవరకు, కొస్తా, రాయలసీమ, తెలంగాణ దామాష ప్రకారం ప్రవేశం ఉంటుంది.
ఆగస్ట్, 18, 2016 న ఉద్ఘాటించబడిన "డా.అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం." రాష్ట్రములొనే అతి చిన్నది. ఉర్దూ భాషయే గాక, తాంత్రిక వైజ్ఞానిక విషయాలను యువ తరానికి నెర్పించే ఉద్దేశముతో దీనిని నెలకొల్పారు.
ప్రస్తుతానికి, కర్నూలు ఒస్మానియా కళాశాల ప్రాంగణములొ విధులు నిర్వహిస్తున్న ఈ సంస్థకు, కర్నూలుకు 20 కి.మీ. దూరములొని ఒర్వకల్ దగ్గర నూరు ఎకరాల స్థలాన్ని కేటయించారు. ముదటి విడతలొ ఇరవై కోట్ళ నిధిని కూడా కేటాయించనున్నట్ళు, ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ గమనించవలసిన ఒక అంశం. ఉర్డూ పరాయి భాష కాదు. అది మొగలాయి దర్భారులొ, హిందీ, ఫారసి, అరబిక్ మెళవింపుతో రూపొందిన విశేష భారతీయ భాష; వయసు రీత్యా అతి చాలా అధునికమయినది.
నదులన్ని ఊటగానో, చెరువుగానో జన్మించి ప్రయాణిస్తూ అగాధమైన జలరాశియై, వందల, వేల, లక్షల జీవరాశులకు, తరతరాలుగా ఆశ్రయమిస్తున్న వాస్తవాన్ని గమనించాలి. ఈ సంస్థలన్నిఅటువంటి ప్రవాహాలు. ఈ ప్రవాహాలు ఎల్లప్పుడూ పారుతూ ఊండాలి.
దానికి వాన, వరద అవసరం. పర్యావరణ పరిరక్షణవల్ల అది సాధ్యం. ప్రస్తుతం ప్రభుత్వం ఇక్కడ వదవి విరమణ చెసిన సిబ్బంది స్థానంలొ తాత్కాలిక ఉద్యోగులను నియమిస్తున్నది. . నొబెల్ బహుమతి పొందిన వారొకరికి ఇచ్చె వంద కోట్ళ రూపాయిలను ప్రస్తుతం విద్యారంగం మీద పెట్టుబడి పెడితె, ఎన్నో నొబెల్ పురస్కార అవకాశాలు మెరుగుపర్చవచ్చు. బీదరికముతొ ముప్పు తిప్పలు పడుతున్న ఈ విద్యార్థులు, వ్యవసాయ, అటోరిక్ష, హోటేలులొ, పేండ్లిలు పేరంటాలలొ వంట, వగైరా అంశకాలిక ఉద్యోగాన్ని చేస్తూ తల్లి తండ్రుల పై అప్పుల బరువు భాధ్యతలను తగ్గిస్తున్నారు. అందువల్ల వారు ట్యూషన్ కు పోలేరు; సమయము, దబ్బు రండూ లేవు. వారికి అత్యుత్తమైన శిక్షణ ఇవ్వవలసిన భాద్యతను ప్రభుత్వం విస్మరించరాదు. వారినుంచే ఒక విశ్వేశ్వరయ్య, ఆంధ్ర కేసరి, మహాత్మా ఫూలె, అంభెడ్కర్, లాల్ బహద్దూర్ శాస్త్రి, కామరాజ్ నాడార్ డాక్టర్ హక్ ఉద్భవించేది.ఇలాంటి చర్యల కోసం సమాజం నిరీక్షిస్తున్నది.