జేనూర్: సమతపై అత్యాచారం, హత్య ఘటన మరవక ముందే కొమరం భీం జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇద్దరు యువకులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

మాయమాటలు చెప్పి మభ్యపెట్టి బాలికను ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దాంతో బాలిక గర్భం దాల్చింది. జిల్లాలోని జైనూర్ మండలం శేకుగూడ గ్రామంలో ఆ ఘటన చోటు చేసుకుంది. 

Also Read: స్నేహితుడి భార్య పై అత్యాచారం...డీఎన్ఏ టెస్టుతో దొరికిన నిందితుడు

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను ఆత్రం ప్రభు (24), పెందూర్ శ్రీకాంత్ (19)లుగా గుర్తించారు. వారిద్దరిపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆ ఘటన తన దృష్టికి రావడంతో నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసులు పెట్టాల్సిందిగా జిల్లా డిఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సమత అత్యాచారం, హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

సమత హత్య కేసులో పోలీసులు ముగ్గురిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. దిశ కేసు నేపథ్యంలో తీవ్ర ఆందోళన చెలరేగడంతో సమత కేసు విచారణకు ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది.