స్నేహితుడి భార్యపైనే ఓ వ్యక్తి కన్నేశాడు. పొలంలో ఉన్న తన భార్యను తీసుకురమ్మని స్నేహితుడు పంపిస్తే.... కామంతో కళ్లు మూసుకుపోయి ఆమెను చంపేశాడు. అనంతరం ఆమెను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా.... నిందితుడిని డీఎన్ఏ టెస్టు ద్వారా పోలీసులు గుర్తించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలం వడ్లూర్‌ గ్రామానికి చెందిన మహిళ ఉదయాన్నే మాదాపూర్‌లోని తమ పొలానికి వెళ్లింది. మరోవైపు.. ఆమె భర్త తన స్నేహితుడు చెక్కిల్ల శ్రీనివా్‌సగౌడ్‌తో కలిసి మధ్యాహ్నం నుంచి వడ్లూర్‌ గ్రామంలోని బెల్ట్‌ షాప్‌లో మద్యం తాగుతున్నాడు.

సాయంత్రం 4 గంటలకు తన భార్యను తీసుకురమ్మంటూ శ్రీనివాస్ గౌడ్ కి ద్విచక్ర వాహనం ఇచ్చి పంపాడు. అప్పటికే మత్తుతో మదమెక్కిన శ్రీనివాస్ గౌడ్‌.. తన స్నేహితుడి భార్యను మొక్కజొన్న చేలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి, అనంతరం గొంతు నులిమి చంపేశాడు. 

కాగా... ఈ కేసులో సదరు మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. శ్రీనివాస్ గౌడ్ మీద అనుమానంతో తొలుత అరెస్టు చేశారు. కాగా... ఫోరెన్సిక్ ల్యాబ్ లో డీఎన్ఏ టెస్టు చేయగా... నిందితుడు శ్రీనివాస్ గౌడ్ అని తేలింది. మహిళ శరరీంలోని అతని వీర్యాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా... మహిళ హత్యాచార ఘటన గత నెల నవంబర్ లో చోటుచేసుకుంది.