మట్టంపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లా మట్టంపల్లి మండల కేంద్రం సర్పంచ్  ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ జరిగింది. మట్టంపల్లి గ్రామంలో పేదలకు కూరగాయలను  గ్రామ సర్పంచ్  మన్నెం శ్రీనివాసరెడ్డి  పేదలకు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ లో ఉన్న పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ పనిచేస్తున్నట్లు చెప్పారు. పుట్టి పెరిగిన గ్రామానికి 
తనవంతు భాద్యత గా సహాయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబర్ కొత్తపల్లి అశోక్, పిఎసీఎస్ డైరెక్టర్ కొమ్ము కరుణ సైదులు, పొట్ట వెంకన్న, మన్నెం అనిల్ రెడ్డి, ఆరాల సైదులు ,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.