మచిలీపట్నం: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో తీవ్ర ఇసుక కొరత నెలకొందంటూ మాజీ మంత్రి, టిడిపి నాయకులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. అయితే ఇది సాధారణంగా ఏర్పడిన కొరతకాదని సాక్షాత్తు ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరతేనని ఆయన పేర్కొన్నారు. వైసిపి నాయకుల కనుసన్నల్లో ఇసుక దందా కొనసాగుతోందని...ఈ పరిస్థితి నుండి రాష్ట్రాన్ని బయటపడేసేందుకే తాను ఈ 36 గంటల ఆమరణదీక్షకు సిద్దపడినట్లు రవీంద్ర వెల్లడించారు.
 
అయితే గాంధీజీ అహింసా మార్గంలో దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నా పోలీసులు మమల్ని రాత్రి నుంచి వేధిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా మా దీక్షను అడ్డుకోడానికి వారు విశ్శ ప్రయత్నాలు చేశారని అన్నారు. చివరకు మమ్మల్ని దీక్షాస్థలికి చేరుకోకుండా అడ్డుకుని రెండు పోలీస్ స్టేషన్లు తిప్పి ఇంటికి‌ తీసుకొచ్చారని వెల్లడించారు.

పోలీసులు భగ్నం చేసినా 36 గంటల నిరాహారదీక్ష కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. మచిలీపట్నంలోని తన ఇంటి దగ్గరే దీన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. ఈ మేరకు అక్కడే కూర్చుని ధీక్ష చేపట్టారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ నియంతలా మారి ప్రజావ్యతిరేక విదానాలతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఇసుక లేక అసంఘటిత కార్మికులు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 కొత్త ఇసుక పాలసీ వచ్చి నెల రోజులు గడుస్తున్నా..సామాన్యులకు ఇంకా ఇసుక దొరకడం లేదన్నారు. వైసిపి నాయకుల ఇసుక కేంద్రాలకు భారీగా ఇసుక తరలిపోతోందని ఆరోపించారు.  ప్రభుత్వానికి ఈ విషయం తమ నిరసన ద్వారా చెప్పాలని చూస్తే పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారని అన్నారు. 

ప్రభుత్వ, పోలీసుల బెదిరింపులకు బయపడేది లేదని...36 గంటల దీక్షతో ఆపే ప్రసక్తే లేదన్నారు. సామాన్యులకు ఇసుక చేరే వరకు ఈ నిరసన కొనసాగిస్తామని కొల్లు రవింద్ర ప్రకటించారు. 

 వైఎస్సార్‌సిపి నాయకులు కూడా రవీంద్ర దీక్షను భగ్నం చేసే ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ  దీక్షకు వ్యతిరేకంగా కోనేరు సెంటర్లో ధర్నా చేపట్టనున్నట్లు...అందుకోసం పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలంటూ పిలుపునిచ్చారు. ఇలా టిడిపి, వైసిపి పార్టీలు ఆందోళనకు పిలుపునివ్వడంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు మాజీ మంత్రి రవీంద్రను అడ్డుకున్నారు. 

సంబంధిత వార్తలు

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ (వీడియో)...