అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ కేబిజెట్ సోమవారం ఉదయం భేటీ  కానుంది. ఉదయం 9.30 ఈ సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతోంది. మండలి రద్దే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కేబినెట్ భేటీ ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. మండలి భవితవ్యంపై ఈ  సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

మండలి రద్దుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాత తీర్మానాన్ని శాసనసభలో ప్రతిపాదించే అవకాశం ఉంది. మండలి అవసరమా అనే విషయంపై అనే విషయంపై సోమవారం చర్చిద్దామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం శాసనసభలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసన మండలి రద్దుకు మంత్రివర్గం తీసుకునే నిర్ణయంపై తీర్మానం ప్రతిపాదించి శాసనసబలో చర్చకు పెడుతారని భావిస్తున్నారు. 

అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత పార్లమెంటు ఆమోదం కోసం కేంద్రానికి పంపిస్తారు. కేంద్రం శాసనసభ తీర్మానాన్ని ఆమోదించక తప్పని పరిస్థితే ఉంటుంది. అయితే, దానికి ఎంత సమయం తీసుకుంటుందనేది చెప్పలేం. త్వరలో పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తమ తీర్మానానికి సత్వర ఆమోదం లభించవచ్చునని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపి వికేంద్రీకరణ, సీఆర్డిఏ రద్దు బిల్లులను శాసనసభ ఆమోదించగా శాసనమండలి మాత్రం వ్యతిరేకించింది. మండలిలో అధికార పార్టీకి బలం లేకపోవడంతో కీలకమైన ఈ బిల్లులపై మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో ఎలాగయినా రాజధానిని విశాఖకు తరలించాలన్న పట్టుదలతో వున్న ముఖ్యమంత్రి జగన్ మండలి రద్దుకు చర్యలు తీసుకునే  ఆలోచనలో  వున్నట్లు తెలుస్తోంది. 

4 నెలలు బిల్లులను ఆపి ఏం సాధిస్తారు: బాబుపై అంబటి ఫైర్

విజయసాయి రెడ్డికి కౌన్సిల్ ఏం పని...? బెయిల్ పై బయటుండగా...: టిడిపి ఎమ్మెల్సీలు

ప్రాసెస్ పూర్తి కాలేదు, ట్విస్టిచ్చిన షరీఫ్: టీడీపీ, వైసీపీ వాదనలు ఇవీ

ఇప్పటికే పార్టీ, ప్రభుత్వానికి చెందిన  సీనియర్లతో జగన్ సమావేశమై శాసనమండలిపై చర్చించారు. అంతేకాకుండా గురువారం అసెంబ్లీలో కూడా మండలిలో జరిగిన పరిణామాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... శాసనమండలికి సంబంధించిన అంశాలపై సోమవారం చర్చించి ఓనిర్ణయం తీసుకుందామని అన్నారు. 

దీంతో సోమవారం ఏం జరుగుతుందో అన్న దానిపై ఇప్పటికే అలు  నాయకుల్లో ఇటు ప్రజల్లో ఉత్కంఠ  మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ భేటీకి సంబంధించిన ప్రకటన వెలువడంతో ఏదో  కీలక నిర్ణయమే ప్రభుత్వం తీసుకోనుందని తెలుస్తోంది. సోమవారం ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి భవితవ్యం ఏంటో తేలనుంది. 

మండలిలో అసలు జరిగింది ఇదీ... వీడియో విడుదల చేసిన లోకేష్

ఛైర్మెన్ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం లేదు: జగన్‌పై యనమల