మండలిలో అసలు జరిగింది ఇదీ... వీడియో విడుదల చేసిన లోకేష్

2014 రాష్ట్ర విభజనను ఎంత అప్రజాస్వామికంగా, నిరంకుశంగా పార్లమెంట్ తలుపులు మూసి, లైవ్ టెలికాస్ట్ ఆపి వేసి, ఏపీ ఎంపీలపై దాడి చేసి మూకబలంతో బిల్లు తెచ్చారో. అదే విధమైన దారుణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చోటు చేసుకున్నాయి.

ex minister Lokesh share the video of what is actually happens in legislative council

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఓ వైపు వైసీపీ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేయాలని అనుకుంటోంది. మరోవైపు శాసన మండలిలో వైసీపీ నేతలు దారుణంగా ప్రవర్తించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా... అసలు బుధవారం మండలిలో ఇది జరిగింది అంటూ లోకేష్ ఓ వీడియో విడుదల చేశారు.

శాసనమండలిలో ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు చర్చ సందర్భంగా ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో శాసనమండలిలో ఏం జరిగిందనేదానిది నారా లోకేశ్ ఈ లేఖలో పేర్కొన్నారు.
 
‘‘ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం. దేవాలయం లాంటి శాసనమండలిలో ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చలా వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వం తీరు, గుండాల్లా దాడి చేసిన మంత్రుల వ్యవహారశైలిని ప్రపంచం ముందుకు తెచ్చేందుకు ఒక బాధ్యత కలిగిన శాసనమండలి సభ్యుడిగా ఈ బహిరంగ లేఖ విడుదల చేస్తున్నా. ఏపీ శాసనసభ, శాసనమండలిలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు మీరు చూసే ఉంటారు. 2014 రాష్ట్ర విభజనను ఎంత అప్రజాస్వామికంగా, నిరంకుశంగా పార్లమెంట్ తలుపులు మూసి, లైవ్ టెలికాస్ట్ ఆపి వేసి, ఏపీ ఎంపీలపై దాడి చేసి మూకబలంతో బిల్లు తెచ్చారో. అదే విధమైన దారుణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చోటు చేసుకున్నాయి.


ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలకు పాలకపక్షం పాల్పడటం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. మండలిలో సభ్యులు కానీ మంత్రులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలపై దాడులకు దిగారు. మండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపేశారు. ఇంటర్‌నెట్ సేవలు ఆపేశారు. కరెంట్ కట్ చేశారు. ఇటువంటి సమయంలో గౌరవ అధ్యక్ష స్థానంలో ఉన్న షరీఫ్ వైపు ఒక్కసారిగా వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు దూసుకొచ్చారు. ఛైర్‌ని చుట్టుముట్టారు. ఛైర్మన్‌ను అంతు చూస్తామని బెదిరించారు. ఇతర టీడీపీ సభ్యులపైనా మూకుమ్మడిగా దాడి చేశారు. మండలి సభ్యుడిగా ఫోన్‌లో ఎటువంటి వీడియోలు చిత్రీకరించకూడదు.
 
కానీ వైసీపీ మంత్రులు తమ పంతం నెగ్గించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తా అంటూ హెచ్చరిస్తుండటంతో ఛైర్మన్, ఇతర ఎమ్మెల్సీల భద్రత కోసం తప్పని సరై వీడియో తీశాను. విలువలు, విశ్వసనీయత అంటూ లెక్చర్లు దంచే సీఎం జగన్, వైసీపీ మంత్రులు మండలిలో ఎలా ప్రవర్శించారో ప్రజల ముందుంచే ప్రయత్నమే ఇది.’’ అని లోకేశ్ రెండు పేజీల లేఖతో పాటు వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios