అమరావతి:శాసనమండలి ఛైర్మెన్ తీసుకొన్న నిర్ణయాలను ప్రశ్నించే అధికారం  ఎవరికీ లేదని  టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు చెప్పారు.

శాసనమండలిలో చర్చ గురించి శాసనసభలో ఏ విధంగా చర్చిస్తారని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. మండలిని రద్దు చేసే సమయంలో చర్చిస్తారన్నారు. కానీ, గురువారం నాడు సభలో మండలి గురించి ఎందుకు చర్చించారని ఆయన ప్రశ్నించారు. శాసనమండలిని రద్దు చేసే  సమయంలోనే శాసనసభలో  ఈ విషయమై చర్చిస్తారో చెప్పాలన్నారు. 

గురువారం నాడు సాయంత్రం టీడీపీ  ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు.శాసన మండలిలో సభ్యులు కానీ వాళ్లు సభలో ఉండకూడదని కోరినట్టుగా యనమల రామకృష్ణుడు గుర్తు చేశారు.

వైసీపీ నుండి విజయం సాధించిన వారిలో  ఎక్కువగా   క్రిమినల్స్ రికార్డులు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని చెప్పారు.  ఓటింగ్ కోసం తాము పట్టుబట్టినట్టుగా చెప్పారు. అధికారపక్షం శాసనమండలిలో రూల్స్‌ను అతిక్రమించే ప్రయత్నం చేశారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

సెలెక్ట్ కమిటీకి సంబంధిత మంత్రే ఛైర్మెన్ గా ఉంటారని చెప్పారు. ఈ కమిటీలో టీడీపీ సభ్యులు ఎక్కువ మంది ఉంటారని యనమల రామకృష్ణుడు చెప్పారు. అమరావతిని చూస్తే చంద్రబాబు గుర్తుకు వస్తున్నారు. అందుకే అమరావతిని ధ్వంసం చేయాలని జగన్ పూనుకొన్నారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.తుగ్లక్ చేసిన మంచి పనులు కూడ జగన్ చేయలేదని యనమల రామకృష్ణుడు చెప్పారు.రాజధానిని మార్చి తుగ్లక్ నష్టపోయాడని యనమల ఈ సందర్భంగా గుర్తు చేశారు.