4 నెలలు బిల్లులను ఆపి ఏం సాధిస్తారు: బాబుపై అంబటి ఫైర్
శాసనమండలిలో నిన్న జరిగిన పరిణామాలు బాధాకరమన్నారు వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. అసెంబ్లీలో గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. రెండు బిల్లులను తన విచక్షణాధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ఛైర్మన్ ప్రకటించగానే తాను ఆశ్చర్యానికి గురయ్యానని అంబటి తెలిపారు
శాసనమండలిలో నిన్న జరిగిన పరిణామాలు బాధాకరమన్నారు వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. అసెంబ్లీలో గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. రెండు బిల్లులను తన విచక్షణాధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ఛైర్మన్ ప్రకటించగానే తాను ఆశ్చర్యానికి గురయ్యానని అంబటి తెలిపారు.
ఎవరైనా వెళ్లి గ్యాలరీలో కూర్చోవచ్చునని.. అయితే చంద్రబాబు స్థాయి వ్యక్తి అక్కడ కూర్చోవాల్సిన అవసరం ఏంటని రాంబాబు ప్రశ్నించారు. సభను, ఛైర్మన్‌ను ప్రభావితం చేయడానికే ఆయన అక్కడ కూర్చున్నారని అంబటి ఆరోపించారు.
Also Read:ఈ సభ అవసరమా అని 70 ఏళ్లనాడే అన్నారు: ధర్మాన ప్రసాదరావు
ఆలస్యం చేయడం కోసమే డ్రామా ఆడినట్లు స్పష్టంగా అర్థమవుతోందని.. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న మండలి అసరమా అని రాంబాబు ప్రశ్నించారు. బిల్లులు అడ్డుకుని తెలుగుదేశం పార్టీ ఏం సాధించదలచుకుందని ఆయన ధ్వజమెత్తారు.
రాజకీయ గందరగోళాన్ని సృష్టించేందుకే అమరావతిలో ఉద్యమానికి మద్ధతుగా నిలిచారు కానీ.. రైతులకు న్యాయం చేసే వ్యక్తి కాదని అంబటి సూచించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో భారతదేశంలోనే చంద్రబాబు లాంటి వ్యక్తి లేరని ఆయన మండిపడ్డారు.
అసెంబ్లీ సమావేశాలు మొత్తం అమరావతిలోనే జరగాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. మంత్రులు తాగొచ్చారంటూ వారిని కించపరిచే విధంగా ప్రవర్తించారని అంబటి మండిపడ్డారు. చంద్రబాబు రైతులను మరోసారి మోసం చేస్తున్నారని.. సమస్యలు ఏమైనా ఉంటే చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాంబాబు సూచించారు.
అంతకుముందు ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై మండలిలో జరిగిన పరిణామాలపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. 70 ఏళ్ల నాడే ఆచార్య ఎన్జీ రంగా పెద్దల సభ అవసరం లేదని చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు.
ప్రజలు ఎన్నుకున్న సభ ఆమోదించిన చట్టాలను శాసనమండలి ఎలా అడ్డుకుంటుందని ధర్మాన ప్రశ్నించారు. నాలుగు నెలల కాలం వరకు ఏ బిల్లునైనా సెలెక్ట్ కమిటీకి పంపితే ఆపగలరని.. ఇది ఇది మంచి పద్ధతి కాదని ప్రసాదరావు తెలిపారు.
Also Read:29 గ్రామాల్లో పూలు పడినా.. 30వ గ్రామంలో రాళ్లవర్షమే: బాబుపై కన్నబాబు వ్యాఖ్యలు
ఇలా చూసీ చూడనట్లు పోతుంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేయలేరని, ప్రభుత్వం పరుగులు తీయాలనుకుంటే పెద్దల సభ అడ్డుపడుతుందని ప్రసాదరావు గుర్తుచేశారు.
ప్రభుత్వాన్ని నడనివ్వకుండా చేయడం కోసం ఇలాంటి దురుద్దేశాలకు ఎప్పుడూ ఒడిగడుతూనే ఉంటారని, మండలిని కొనసాగించాలా..? వద్దా అన్న విషయంపై ఆలోచించాలని ముఖ్యమంత్రిని ధర్మాన కోరారు.