అతిపెద్ద సవాలు అదే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్
Rohit Sharma : 2024 టీ20 ప్రపంచకప్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే అమెరికాలో ప్రాక్టీస్ సెషన్లను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఓ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rohit Sharma's comments go viral : ప్రపంచ నెంబర్ వన్ టీ20 జట్టు అయిన టీమిండియా రాబోయే టీ20 ప్రపంచకప్ 2024 కోసం సన్నద్ధమవుతోంది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ఇప్పటికే అమెరికాలో ప్రాక్టీస్ సెషన్స్ ప్రారంభించింది. 2024 టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత క్రికెట్ జట్టు జూన్ 5న ఐర్లాండ్ తో తన తొలి మ్యాచ్ ను ఆడనుండగా, జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనుంది. దీనికి ముందు జూన్ 1న పొరుగున ఉన్న బంగ్లాదేశ్ తో భారత్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పాత్రకు సంబంధించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ కు సంబంధించిన వీడియోను రోహిత్ శర్మ షేర్ చేశాడు. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ తన బాధ్యతల గురించి వివరించాడు. "కెప్టెన్ గా అందరూ ఒకేలా ఉండరు కాబట్టి విభిన్న వ్యక్తులను హ్యాండిల్ చేయడం అతిపెద్ద సవాలు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన డిమాండ్లు ఉంటాయి. మీరు విషయాలను ఎలా సంప్రదిస్తారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుందని" హిట్ మ్యాన్ పేర్కొన్నాడు. "కాబట్టి, మీరు ఈ విషయాలన్నింటినీ గ్రహించాలి.. మీరు దానిని ఎలా ఎదుర్కోవాలో మీ ఇష్టం. కెప్టెన్ గా ఉన్నప్పుడు, నేను నేర్చుకున్న అతిపెద్ద విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరికీ ప్రాముఖ్యత ఇవ్వడం చాలా అవసరం. ప్రతి ఒక్కరూ తాము జట్టులో భాగమనీ, వారు ముఖ్యమని భావించాలి" అని కూడా అన్నాడు.
T20 WORLD CUP 2024 : టీమిండియా మ్యాచ్‌లు ఏ సమయంలో జరుగుతాయి? మ్యచ్ టైమింగ్స్, వేదికల వివరాలు ఇవిగో
"ఎవరైనా మీ వద్దకు ఏదైనా సమస్యను తీసుకువచ్చినప్పుడు, వారు చెప్పేది వినడం ద్వారా మంచి పరిష్కారం ఏమిటో మీరు గుర్తించాలి. ఇది మీరు మీ సహచరులకు తెలియజేయాల్సిన విషయం. కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను నేర్చుకోవడం మంచి విషయం. కెప్టెన్ గా, ఆటగాడిగా నేను సన్నద్ధం కావాలి" అని రోహిత్ శర్మ అన్నాడు. కాగా, టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించడం ఇది రెండోసారి. అంతకు ముందు 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ లో జట్టుకు సారథ్యం వహించాడు. అంతేకాదు గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ లో కూడా టీమ్ఇండియాకు కెప్టెన్ గా ఉన్నాడు. అయితే, కెప్టెన్ గా ఇంకా ప్రపంచకప్ విజయాన్ని అందుకోలేకపోయిన రోహిత్ శర్మ.. ఈ సారి ఎలాగైనా మెగా టోర్నీ ట్రోఫీని అందుకోవాలనుకుంటున్నాడు.
T20 World Cup 2024 ను రెండు దేశాల్లో ఎందుకు నిర్వహిస్తున్నారు?
ఎంఎస్ ధోనీ టీమిండియా ప్రధాన కోచ్ ఎందుకు కాలేడు?