T20 World Cup 2024 : టీమిండియా మ్యాచ్‌లు ఏ సమయంలో జరుగుతాయి? మ్యచ్ టైమింగ్స్, వేదికల వివరాలు ఇవిగో
T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు సాగే పొట్టి ఫార్మాట్ క్రికెట్ పోటీలో మొత్తం 20 జట్లు పాల్గొంటుండగా.. భారత్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా ఇప్పటికే అమెరికా చేరుకుంది. భారత మ్యాచ్ టైమింగ్స్, వేదికలు పూర్తి వివరాలు మీ కోసం.. !
T20 World Cup 2024 : వెస్టిండీస్, అమెరికాలు వేదికలుగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. వెస్టిండీస్ తో కలిసి అమెరికా ఆతిథ్యమిస్తున్న తొలి ఐసీసీ వరల్డ్ కప్ కూడా ఇదే కావడం విశేషం. ఈ టీ20 ప్రపంచ కప్ 2024 జూన్ 1 నుండి ప్రారంభమై జూన్ 29 వరకు జరగనుంది. ఇది టీ20 ప్రపంచకప్ తొమ్మిదో సీజన్ కాగా మొత్తం 20 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. 2007లో తొలి టీ20 ప్రపంచకప్ జరిగింది. ధోనీ సారథ్యంలో భారత జట్టు విజయం సాధించింది.
టీ20 ప్రపంచ కప్ ను భారత్ లో ఏ సమయంలో చూడవచ్చు?
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు మ్యాచ్‌లు రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతాయి. రాత్రి 8:00 గంటల నుంచి భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కూడా జరగనుంది. అలాగే, మొదటి సెమీ-ఫైనల్ కూడా రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే, ఫైనల్ మ్యాచ్ మాత్రం రాత్రి 7.30 గంటల జరగనుంది.
టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ ఆడే లీగ్ మ్యాచ్ లు..
జూన్ 5- భారత్ Vs ఐర్లాండ్, న్యూయార్క్, సమయం- 8:00 PM
జూన్ 9- భారత్ Vs పాకిస్థాన్, న్యూయార్క్, సమయం- రాత్రి 8:00 PM
జూన్ 12- భారత్ Vs యూఎస్ఏ, న్యూయార్క్, సమయం- 8:00 PM
జూన్ 15 - భారత్ Vs కెనడా, ఫ్లోరిడా, సమయం- 8:00 PM
T20 World Cup 2024 ను రెండు దేశాల్లో ఎందుకు నిర్వహిస్తున్నారు?
టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
2024 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు 9 వేదికలలో జరుగుతాయి. డల్లాస్, బ్రిడ్జ్‌టౌన్‌లతో పాటు, ప్రొవిడెన్స్, న్యూయార్క్, లాడర్‌హిల్, నార్త్ సౌండ్, గ్రాస్ ఐలెట్, కింగ్‌స్టౌన్, తరౌబాలో మ్యాచ్‌లు జరుగుతాయి. నసావు కౌంటీ స్టేడియం న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో ఉంది. ఇది ఈ టోర్నమెంట్ కోసం ప్రత్యేకంగా నిర్మించిన తాత్కాలిక స్టేడియం.
టీ20 ప్రపంచ కప్ 2024 జరిగే వేదికలు ఇవే..
- సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, నార్త్ సౌండ్, ఆంటిగ్వా మరియు బార్బుడా
- కెన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్
- ప్రొవిడెన్స్ స్టేడియం, ప్రొవిడెన్స్, గయానా
- డారెన్ సామీ స్టేడియం, గ్రాస్ ఐలెట్, సెయింట్ లూసియా
- ఆర్నోస్ వేల్ స్టేడియం, కింగ్‌స్టౌన్, సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్
- బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియం, శాన్ ఫెర్నాండో, ట్రినిడాడ్ మరియు టొబాగో
- సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్, లాడర్‌హిల్, ఫ్లోరిడా, యూఎస్ఏ
- గ్రాండ్ ప్రైరీ స్టేడియం, డల్లాస్ (టెక్సాస్), యూఎస్ఏ
- నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం, లాంగ్ ఐలాండ్ (న్యూయార్క్), యూఎస్ఏ
T20 WORLD CUP 2024 లో కొత్త రూల్స్ ఏమిటో తెలుసా? ఎవరికి నష్టం? ఎవరికి లాభం?