ఎంఎస్ ధోనీ టీమిండియా ప్ర‌ధాన కోచ్ ఎందుకు కాలేడు?

Team India Head Coach : టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన తర్వాత భార‌త క్రికెట్ జ‌ట్టు కోసం కొత్త ప్ర‌ధాన చోచ్ రానున్నాడు. ఎందుకంటే అప్ప‌టివ‌ర‌కు భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. ఈ రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్న మ‌రి ఎంఎస్ ధోని ఎందుకు భార‌త ప్ర‌ధాన కోచ్ కావ‌డం లేదు? 
 

Why can't MS Dhoni be the head coach of Team India? RMA

Team India Head Coach : అమెరికా, వెస్టిండీస్ వేదిక‌లుగా జ‌ర‌గ‌బోయే టీ20 ప్రపంచ కప్ 2024 ముగిసిన తర్వాత భారత్ ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. మ‌రోసారి ప‌ద‌వి పొడిగింపును వ‌ద్ద‌ని 'దిగ్రేవాల్' చెప్ప‌డంతో ఈ మెగా టోర్నమెంట్ ముగిసే సమయానికి కొత్త ప్రధాన కోచ్‌ని బీసీసీఐ నియ‌మించ‌నుంది. ఈ పదవికి దరఖాస్తుల కోసం బీసీసీఐ స‌మ‌యం ఇవ్వ‌గా, ఇప్ప‌టికే పెద్ద సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తులు రావ‌డంతో పాటు మే 27తో గ‌డువు ముగిసింది. ఇంత‌కుముందు వీవీఎస్ లక్ష్మ‌ణ్ పేరు వినిపించ‌గా, ఆయ‌న తిర‌స్క‌రించార‌నీ, ఇప్పుడు గౌత‌మ్ గంభీర్ రేసులో ఉన్నార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, భార‌త జ‌ట్టును మూడు ఫార్మాట్ ల‌లో ఛాంపియ‌న్ గా నిలిపిన ఎంఎస్ ధోని ఎందుకు భార‌త జ‌ట్టుకు ప్ర‌ధాన కోచ్ కావ‌డం లేదు?

తదుపరి భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం అన్వేషణ కొనసాగుతున్న క్ర‌మంలో  భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఆ స్థానంలో తీసుకోవాల‌ని భార‌త‌ క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ 2021లో జట్టులో కోచ్ గా చేరాడు. 2023 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ త‌ర్వాత అతని కాంట్రాక్టును రాబోయే T20 ప్రపంచ కప్ వరకు పొడిగించింది బీసీసీఐ. అయితే, మ‌రోసారి త‌న కాంట్రాక్టును పొడిగించవద్దని ద్రవిడ్ అభ్యర్థించాడనీ, ఫలితంగా బీసీసీఐ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింద‌ని నివేదికలు సూచిస్తున్నాయి.

2014లో ఐపీఎల్ లో కేకేఆర్, ఏపీలో టీడీపీ గెలిచింది.. 2024లో కూడా రిపీట్ అవుతుందా?

భారత జట్టు తదుపరి ప్రధాన కోచ్‌గా ఎవరు ఉండాలనే దానిపై అనేక సూచనలు, అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న త‌రుణంలో అభిమానులు ధోని పేరును తీసుకువ‌స్తున్నారు. అయితే భారత మాజీ కెప్టెన్ వెంటనే ప్రధాన కోచ్ కాలేకపోవడానికి కారణం ఉంది. ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చినప్పటికీ, అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. అంటే ఆడ‌టం నుంచి ఇంకా రిటైర్ అవ్వలేదు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అయిన ఆటగాడు మాత్రమే ప్రధాన కోచ్ కాగలడు. ఐపీఎల్ 2025కి ధోని అందుబాటులో ఉంటారనే దానిపై ఇంకా అధికారిక స్పంద‌న‌లు లేవు. కాబ‌ట్టి ఐపీఎల్ నుంచి తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించనంత వరకు భార‌త క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి ధోని అర్హత పొందలేడు.

భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే గడువు సోమవారంతో (మే 27) ముగిసింది. అయితే, ప్ర‌ధాన కోచ్ రేసులో గౌతమ్ గంభీర్ ముందున్నాడ‌ని స‌మాచారం. వీవీఎస్ లక్ష్మణ్, జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్ లు ప్ర‌ధాన చోచ్ ప‌దవిని స్వీక‌రించ‌డానికి నిరాఖ‌రించ‌డంతో గంభీర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ ఏ జట్టుకు కూడా ఎలాంటి హోదాలో ఆడనందున ఈ ఉద్యోగానికి అర్హులు. అయితే గంభీర్ భారత జట్టు కోచ్‌గా మారాలని నిర్ణయించుకుంటే కేకేఆర్ మెంటర్ పదవిని వదిలివేయవలసి ఉంటుంది.

టీమిండియా ప్ర‌ధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్.. !

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios