టీమిండియా కెప్టెన్ విరాట్  కోహ్లీ ప్రపంచ కప్ కు ముందునుండి అసలు విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. విదేశీ, స్వదేశీ సీరిస్లు, ఆ వెంటనే ఐపిఎల్...అది ముగియగానే ప్రపంచ కప్. ఇలా విశ్రాంతి లేకుండానే వరుసగా క్రికెట్ ఆడటం అంత శ్రేయస్కరం కాదని భావించిన బిసిసిఐ కోహ్లీకి కొంతకాలం విశ్రాంతినివ్వాలని  భావించింది. ఇలా వెస్టిండిస్ పర్యటనకు అతన్ని ఎంపికచేయవద్దని సెలెక్టర్లు భావించారు. అయితే కోహ్లీ మాత్రం విశ్రాంతికి అంగీకరించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెలెక్టర్లు అతన్ని ఎంపికచేశారు. 

అయితే రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించడం ఇష్టంలేకే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని తాజాగా బిసిసిఐ ఖండించింది. ప్రపంచ కప్ ఓటమి తర్వాత ఢీలా పడ్డ జట్టులో పునరుత్తేజం తీసుకురావాలన్న ఉద్దేశ్యంతోనే కోహ్లీ విండీస్ పర్యటనపై ఆసక్తి చూపినట్లు ఓ బిసిసిఐ అధికారి తెలిపారు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం తన బాధ్యతగా భావించిన కెప్టెన్ ఈ నిర్ణయాన్ని  తీసుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టు విండీస్ పర్యటన చేపడుతుంటే తాను విశ్రాంతి తీసుకోవడం భావ్యం కాదనే కోహ్లీ ఈ పర్యటనకు సిద్దపడిపడినట్లు సదరు అధికారి వెల్లడించారు. 

అందువల్లే వెస్టిండిస్ పర్యటన కోసం ఇటీవల ప్రకటించిన భారత జట్టులో కోహ్లీకి స్థానం దక్కిందన్నారు. టీ20, వన్డే, టెస్ట్ ఇలా మూడు సీరిస్ లకు కోహ్లీనే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. బయట ప్రచారం జరుగుతున్న రోహిత్ తో విబేధాల కారణంగానే కోహ్లీ ఈ పర్యటనకు సిద్దపడినట్లు జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు. 

ఇది కారణం కాదు

టీమిండియాలో ప్రస్తుతమున్న సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ,  రోహిత్ శర్మల మధ్య అగాదం ప్రపంచ కప్ టోర్నీ ద్వారా మరింత పెరిగినట్లు సమాచారం. దీంతో ఆటగాళ్లు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు... ఓ వర్గానికి కోహ్లీ, మరో వర్గానికి రోహిత్ లు సారథ్యం వహిస్తున్నట్లు ఓ ప్రచారం జరుగుతోంది. బిసిసిఐ కూడా ఆటగాళ్ల మధ్య విబేధాలున్నట్లు సాగుతున్న ప్రచారంపై విచారణ జరపడానికి సిద్దపడ్డారు. అయితే ఈ విబేధాల ప్రభావం విండీస్ పర్యటన  కోసం చేపట్టిన జట్టు ఎంపికపై  పడలేదన్నది బిసిసిఐ అధికారి  వివరణ ద్వారా తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు

టార్గెట్ 2023 వరల్డ్ కప్... టీమిండియా కెప్టెన్ గా రోహిత్...?

టీమిండియాలో లుకలుకలు: రోహిత్, కోహ్లీ చెరో క్యాంప్

రోహిత్ ఆశలు గళ్లంతు... కోహ్లీ వైపే టీమిండియా సెలెక్టర్లు...?

రోహిత్‌కే నా మద్దతు...కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాల్సిందే: వసీం జాఫర్