T20 worldcup 2021: నెదర్లాండ్స్‌కి చుక్కలు చూపించిన శ్రీలంక బౌలర్లు... మొదటి ఓవర్ నుంచి పెవిలియన్‌కి వరుసగా క్యూ కట్టిన నెదర్లాండ్స్ బ్యాట్స్‌మెన్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ సూపర్ 12 రౌండ్‌కి శ్రీలంక జట్టు, మిగిలిన జట్లకి హెచ్చరికలు పంపుతోంది. గ్రూప్ ఏ క్వాలిఫైయర్స్‌లో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లంక బౌలర్లు విజృంభించి, అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు... లంక బౌలర్ల దూకుడుకి, బ్యాట్స్‌మెన్ తొందరపాటు కూడా తోడుకావడంతో 44 పరుగులకే ఆలౌట్ అయ్యింది నెదర్లాండ్స్‌...

మొదటి ఓవర్ నాలుగో బంతికి మాక్స్ ఓడౌడ్ రనౌట్ కావడంతో మొదలైన నెదర్లాండ్స్ పతనానికి ఏ దశలోనూ బ్రేకులు పడలేదు. బెన్ కూపర్ 8, స్టీఫెన్ మెబ్రూగ్ 5, కోలిన్ అక్రేమన్ 11, పీటర్ సీలార్ 2 పరుగులు, స్కాట్ ఎడ్వర్డ్స్ 8 పరుగులు చేసి అవుట్ కాగా... బస్ డే లీడే, వాన్ డేర్ మెర్వే, బ్రెండన్ గ్లోవర్ డకౌట్ అయ్యారు...

నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో రెండో వికెట్‌కి బెన్ కూపర్, స్టీఫెన్ జోడించిన 17 పరుగులకే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం... శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగ 3 ఓవర్లలో9 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా లహీరు కుమార్ మూడు, తీక్షణ రెండు వికెట్లు తీసుకున్నారు. 

డ్రింక్స్ బ్రేక్ సమయానికి 9 వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్స్.. హసరంగ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి నెదర్లాండ్స్‌ను దెబ్బతీయగా, ఆఖర్లో ఒకే మూడు వికెట్లు తీసిన కుమార కథను ముగించాడు...

 టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోరు. ఇంతకుముందు శ్రీలంకపైనే 2014 టీ20 వరల్డ్‌కప్‌లో 39 పరుగులకి ఆలౌట్ అయ్యింది నెదర్లాండ్స్. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఓ జట్టు 10 ఓవర్లలోనే ఆలౌట్ కావడం కూడా ఇదే తొలిసారి.

టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఒకే జట్టును రెండుసార్లు 50 పరుగుల లోపు ఆలౌట్ చేసిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది శ్రీలంక.. ఇప్పటికే సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయిన నెదర్లాండ్స్, ఈ మ్యాచ్‌లో ఓడితే గ్రూప్‌లో ఒక్క విజయం కూడా లేకుండానే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని ముగిస్తుంది...

ఇవీ చదవండి: పాకిస్తాన్‌లో కోహ్లీ కంటే అతనికే ఫాలోయింగ్ ఎక్కువ... ఇక్కడ అందరూ ‘ఇండియాకా ఇంజమామ్’ అని...

వెల్‌కం బ్యాక్ ధోనీ... మాహీ రిటైర్మెంట్ తర్వాత మ్యాచులు చూడడం మానేసిన పాకిస్తానీ బషీర్ చాచా...

T20 worldcup 2021: ధోనీని మెంటర్‌గా తీసుకొచ్చింది అతనే... కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని...

ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు... చితక్కొట్టుడు అంతే ఇదేనేమో... ఆస్ట్రేలియా బ్యాటర్ రికార్డు...

T20 worldcup 2021: మ్యాచ్ అవసరమా, మాకు వాకోవర్ ఇచ్చేయండి... షోయబ్ అక్తర్‌కి హర్భజన్ సింగ్ చురక...

T20 worldcup 2021: అతన్ని తీసుకోవడానికి ధోనీయే కారణం... కోహ్లీ, శాస్త్రిలను ఒప్పించి మరీ...

T20 worldcup 2021: సన్‌రైజర్స్ జట్టు, వార్నర్‌ను అవమానించింది... ఐపీఎల్ వల్లే అతనిలా ఆడుతున్నాడు...

T20 worldcup 2021: నాలుగేళ్లు, రూ.36 వేల కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట...

T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..