Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup 2021 AUS vs SA: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... సఫారీ జట్టుపై భారీ అంచనాలు...

t20 worldcup 2021: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా... వార్మప్ మ్యాచుల్లో అదరగొట్టిన సౌతాఫ్రికా జట్టు..

T20 Worldcup 2021 AUS vs SA: Australia captain finch won the toss and elected to field first
Author
India, First Published Oct 23, 2021, 3:08 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ: సూపర్ 12 రౌండ్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.  వన్డేల్లో అత్యధిక వరల్డ్‌కప్ టోర్నీలు గెలిచిన జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా, టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇప్పటిదాకా టైటిల్ గెలవలేకపోయింది. ఆరు వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యుత్తమంగా సెమీస్‌కే పరిమితమైంది...

ఈ మధ్యకాలంలో ఆసీస్ పర్ఫామెన్స్ కూడా ఏమంత మెరుగ్గా లేదు. స్వదేశంలో టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌ను 2-1 కోల్పోయిన ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ పర్యటనలో 4-1 తేడాతో సిరీస్ ఓడింది. దక్కిన ఒక్క విజయం కూడా చచ్చీ చెడీ ఆఖరి ఓవర్‌లో దక్కించుకున్నదే. అలాంటి పరిస్థితుల్లో టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆసీస్ ప్రదర్శన ఎలా ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది...

Must READ: T20 worldcup 2021: టీమిండియాతో మ్యాచ్... 12 మందితో కూడిన జట్టును ప్రకటించిన పాకిస్తాన్...

అలాగే సౌతాఫ్రికా పరిస్థితి కూడా చెప్పుకోదగినంత గొప్పగా ఏమీ లేదు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న డుప్లిసిస్‌ను టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి ఎంపిక చేయకపోవడం, సఫారీ బోర్డుపై తీవ్ర విమర్శలు రావడానికి కారణమైంది.  అయితే వార్మప్ మ్యాచుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన సౌతాఫ్రికా, తాము కూడా టైటిల్ ఫెవరెట్స్ ఉన్నామని సంకేతాలు పంపారు... 

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేలవ ఫామ్‌లో కొనసాగుతుండడం, స్టీవ్ స్మిత్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకున్నట్టు కనిపిస్తుండడం ఆసీస్‌ను కలవరబెడుతున్న అంశాలు. అయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్ మంచి ఫామ్‌లో ఉండడం వారికి కలిసి రావచ్చు...

సౌతాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్, తెంబా భవుమా, అయిడెన్ మార్క్‌రమ్, రస్సీ వాన్ డే దుస్సేన్, డేవిడ్ మిల్లర్, హెన్రీచ్ క్లాసీన్, డ్వేన్ పెట్రోయస్, కేశవ్ మహరాజ్, కగిసో రబాగా, నోకియా, షంసీ..

ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హజల్‌వుడ్...

ఇవీ చదవండి: 

పాకిస్తాన్‌లో కోహ్లీ కంటే అతనికే ఫాలోయింగ్ ఎక్కువ... ఇక్కడ అందరూ ‘ఇండియాకా ఇంజమామ్’ అని...

వెల్‌కం బ్యాక్ ధోనీ... మాహీ రిటైర్మెంట్ తర్వాత మ్యాచులు చూడడం మానేసిన పాకిస్తానీ బషీర్ చాచా...

T20 worldcup 2021: ధోనీని మెంటర్‌గా తీసుకొచ్చింది అతనే... కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని...

 ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు... చితక్కొట్టుడు అంతే ఇదేనేమో... ఆస్ట్రేలియా బ్యాటర్ రికార్డు...

T20 worldcup 2021: మ్యాచ్ అవసరమా, మాకు వాకోవర్ ఇచ్చేయండి... షోయబ్ అక్తర్‌కి హర్భజన్ సింగ్ చురక...

T20 worldcup 2021: అతన్ని తీసుకోవడానికి ధోనీయే కారణం... కోహ్లీ, శాస్త్రిలను ఒప్పించి మరీ...

 T20 worldcup 2021: సన్‌రైజర్స్ జట్టు, వార్నర్‌ను అవమానించింది... ఐపీఎల్ వల్లే అతనిలా ఆడుతున్నాడు...

 T20 worldcup 2021: నాలుగేళ్లు, రూ.36 వేల కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట...

 T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

Follow Us:
Download App:
  • android
  • ios