IPL 2024, SRH vs RR: ఐపీఎల్ 2024 క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉంచిన 176 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ 139-7 పరుగులు మాత్రమే చేసి 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండ్ షోతో సన్ రైజర్స్ కు సూపర్ విక్టరీ అందించాడు.
SRH vs RR : ఐపీఎల్2024 క్వాలిఫయర్-2 మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ సూపర్ విక్టరీ సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 36 పరుగలు తేడాతో రాయల్స్ ను చిత్తుచేసిన సన్ రైజర్స్.. ఐపీఎల్ 2024 ఫైనల్ పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ ను ఢీ కొట్టనుంది. క్వాలిఫయర్-1లో ఓటమి చవిచూసిన హైదరాబాద్ జట్టు.. రాజస్థాన్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో కేకేఆర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు రెచ్చిపోయింది. నాకౌట్ మ్యాచ్‌లో రాజస్థాన్‌ను తమ స్పిన్ వలలో పట్టుకుని జట్టుకు అద్బుత విజయం అందించారు అభిషేక్ శర్మ, షాబాజ్ అహ్మద్.
ఇంపాక్టు ప్లేయర్ ఇరగదీశాడు.. అభిషేక్ ఈసారి బాల్ తో మ్యాజిక్..
టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ అద్భుతంగా ఆరంభించి పవర్ ప్లేలోనే హైదరాబాద్ ను దెబ్బకొట్టింది. ట్రావిస్ హెడ్ 34 పరుగులు చేసి ఔట్ కాగా, ధనాధన్ ఇన్నింగ్స్ ఆడే అభిషేక్ తొలి ఓవర్ లోనే పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి 15 బంతుల్లో 37 పరుగులు చేసి మ్యాచ్‌కు ప్రాణం పోశాడు. మరో ఎండ్‌లో క్లాసెన్ అద్భుతంగా అర్ధశతకం బాదాడు. ఈ అర్ధ సెంచరీతో హైదరాబాద్ స్కోరు బోర్డుపై 175 పరుగులు చేసింది. టార్గెట్ ను ఛేధించే క్రమంలో రాజస్థాన్ 7 వికెట్లు కోల్పోయి 139 పరుగలు మాత్రమే చేయగలిగింది.
అయితే, ఈ మ్యాచ్ లో ఇంపాక్టు ప్లేయర్ గా వచ్చిన షాబాజ్ అహ్మద్ అద్భుతం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ రాణించి ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో నిజమైన బ్రేక్ త్రూ అన్‌టాప్డ్ షాబాజ్ అహ్మద్ అందించాడు. యశస్వి జైస్వాల్, ఆర్ అశ్విన్, రియాన్ పరాగ్‌లకు షాబాజ్ పెవిలియన్ పంపించి పూర్తిగా మ్యాచ్ ను హైదరాబాద్ వైపు తీసుకువచ్చాడు. బ్యాటింగ్ లో 18 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ లో కీలకమైన 3 వికెట్లు తీసుకున్నాడు. ఇంకాప్టు ప్లేయర్ గా వచ్చి ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన షాబాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
షాబాజ్ తో పాటు ధనాధన్ బ్యాటింగ్ తో అదరగొట్టే సన్ రైజర్స్ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనను చూపించాడు. బ్యాటింగ్ సమయంలో పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయిన అభిషేక్ శర్మ.. బాల్ తో జట్టుకు మంచి మలుపును అందించారు. బ్యాట్‌తో ఫ్లాప్ అయినా బంతితో తన మ్యాజిక్ చూపిస్తూ 2 ముఖ్యమైన వికెట్లు తీశాడు. సంజూ శాంసన్, హిట్మేయర్ వికెట్లను తీసుకున్నాడు. సన్ రైజర్స్ విజయంలో తనదైన ముద్ర వేశాడు. ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్ జట్టు మూడోసారి ఫైనల్స్‌కు చేరుకుంది. కమిన్స్ అండ్ కో మరోసారి కేకేఆర్ తో బిగ్ ఫైట్ చేయనుంది.
Rohit Sharma : పాకిస్థాన్ కు వెళ్లాలనుకుంటున్నాను.. రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్
IPL 2024 ఫైనల్ కు చేరిన సన్‌రైజర్స్.. రాజస్థాన్ పై ఆల్‌రౌండ్ షో తో హైదరాబాద్ గెలుపు
