IPL 2024 ఫైన‌ల్ కు చేరిన‌ సన్‌రైజర్స్.. రాజ‌స్థాన్ పై ఆల్​రౌండ్​ షో తో హైద‌రాబాద్ గెలుపు

IPL 2024, SRH vs RR: ఐపీఎల్ 2024 క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడించింది. ఫైన‌ల్ పోరులో కేకేఆర్ తో త‌ల‌ప‌డ‌టానికి ముందడుగు వేసింది.

Ipl 2024: Sunrisers Hyderabad reach final Hyderabad win over Rajasthan with an all-round show RMA

Rajasthan Royals vs Sunrisers Hyderabad : ఐపీఎల్2024 క్వాలిఫయర్-2 మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఐపీఎల్ ఫైన‌ల్ పోరులో రెండో బెర్తు కోసం శుక్ర‌వారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో హైద‌రాబాద్ టీమ్ ఆల్ రౌండ్ షో తో దుమ్మురేపింది. 36 ప‌రుగుల తేడాతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై గెలిచి ఐపీఎల్ 2024 లో ఫైన‌ల్ కు చేరుకుంది.

ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన హైద‌రాబాద్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 175 ప‌రుగులు చేసింది. తొలి ఓవర్ లోనే అభిషేక్ శర్మ వికెట్ పడటంతో ఎస్ఆర్హెచ్ కు బిగ్ షాక్ తగిలింది. అయితే, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠిలు హైదరాబాద్ కు మంచి భాగస్వామ్యం అందించారు. ట్రావిస్ హెడ్ 34 పరుగులు, రాహుల్ త్రిపాఠి 37 పరుగులు చేశారు. మరోసారి ఐడెన్ మార్క్రమ్ నిరాశపరిచాడు. ఒక పరుగు మాత్రమే చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ చాహల్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు వరుసగా ఔట్ కావడంతో హైదరాబాద్ పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. కానీ, హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్ లు ఆడిన మంచి ఇన్నింగ్స్ తో 175 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ తన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లో 4 సిక్సర్లు బాదాడు. షాబాజ్ 18 పరుగులు చేశాడు. ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ లు చెరో 3 వికెట్లు తీసుకున్నారు.  సందీప్ శర్మకు రెండు వికెట్లు పడ్డాయి. 

అభిషేక్, షాబాజ్ లు రాజస్థాన్ ను రఫ్ఫాడించారు.. 

175  పరుగులు చాలా స్వల్పంగా ఛేదించే విధంగా పవర్ ప్లేలో రాజస్థాన్ కు ఆరంభం లభించింది కానీ,  హైదరాబాద్ బౌలర్లు బ్రిలియంట్ బౌలింగ్, సూపర్ ఫీల్డింగ్ తో ఆర్ఆర్ ను దెబ్బకొట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ రాజస్థాన్ కు మంచి శుభారంభం అందించాడు. 42 పరుగుల తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ తో చివరి వరకు ధ్రువ్ జురెల్ పోరాటం చేసినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. కీలక మ్యాచ్ లో సంజూ శాంసన్ 10 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అలాగే, రియన్ పరాగ్, అశ్విన్, హిట్మెయర్, పావెల్ లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో రాజస్థాన్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.

ఐపీఎల్ 2024 కేకేఆర్ తో హైదరాబాద్ ఫైనల్ ఫైట్.. 

క్వాలిఫయర్ 2లో అద్భుతమైన ప్రదర్శనతో రాజస్థాన్ పై విజయం సాధించిన హైదరాబాద్ టీమ్ ఐపీఎల్ 2024 లో ఫైనల్ కు చేరుకుంది. ఐపీఎల్ 2024 టైటిల్ కోసం ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. రెండు టీమ్ లు బలమైన ప్రదర్శనలు చేసి ఫైనల్ కు చేరాయి. రెండు స్ట్రాంగ్ టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్ క్రికెట్ లవర్స్ లో మరింత ఉత్కంఠను రేపుతోంది.

 

 

ROHIT SHARMA : పాకిస్థాన్ కు వెళ్లాల‌నుకుంటున్నాను.. రోహిత్ శ‌ర్మ షాకింగ్ కామెంట్స్ 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios