Rohit Sharma : పాకిస్థాన్ కు వెళ్లాలనుకుంటున్నాను.. రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma : 2023 ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చినప్పటికీ ఈ టోర్నమెంట్ కోసం భారత జట్టును పాక్ పంపించడానికి బీసీసీఐ నిరాకరించింది. దీంతో టీమిండియా తన మ్యాచ్ లను శ్రీలంకలో ఆడగా, మిగిలిన జట్ల మ్యాచ్ లు పాకిస్థాన్ లో జరిగాయి.
Rohit Sharma : దాయాదుల పోరు అంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయంటే చాలు రెండు దేశాల క్రికెట్ లవర్స్ తో పాటు చాలా దేశాల క్రికెట్ ప్రియులు స్టేడియంతో పాటు టీవీల ముందు అతుక్కుపోతారు. ఇక భారత్-పాక్ లో అయితే వేరే లెవల్ లో క్రేజ్ ఉంటుంది. ఈ రెండు జట్లు గత ఒకటిన్నర దశాబ్దాలుగా ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య 2007-2008 మధ్య సిరీస్ జరిగింది. చాలా కాలం నుంచి భారత్-పాక్ సిరీస్ గురించి భారత ప్లేయర్లు స్పందించింది లేదు. కానీ, తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత్-పాక్ సిరీస్ పై మౌనం వీడాడు.
భారత్-పాక్ సిరీస్, మ్యాచ్ ల నిర్ణయం క్రికెట్ బోర్డు బీసీసీఐ చేతుల్లో ఉందని రోహిత్ శర్మ తెలిపాడు. సిరీస్ ను నిర్ణయించడం తన లేదా ఇతర ఆటగాళ్ల పని కాదని తెలిపాడు. తమకు ఫిక్స్ చేసిన టోర్నమెంట్, ఆడే ప్రదేశానికి తాము చేరుకుంటామని చెప్పాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతి ఇస్తే పాకిస్థాన్ వెళ్లి క్రికెట్ ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
పాకిస్థాన్ కు జట్టును పంపేందుకు నిరాకరించిన భారత్
2023 ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చినప్పటికీ ఆసియా కప్ కోసం తమ జట్టును పాక్ కు పంపడానికి బీసీసీఐ నిరాకరించింది. దీంతో భారత జట్టు తన మ్యాచ్ లను శ్రీలంకలో ఆడింది. మిగిలిన జట్ల మ్యాచ్ లు పాకిస్థాన్ లో జరిగాయి. ఆసియా కప్ ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. దీంతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా పాకిస్థాన్ లోనే జరగాల్సి ఉంది.అయితే భారత్ తన మ్యాచ్ లు ఆడేందుకు పాక్ కు వెళ్తుందా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు.
పాక్ తో ఆడేందుకు.. రోహిత్ శర్మ
అంతకుముందు రోహిత్ శర్మ పాక్ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్- పాక్ జట్ల మధ్య రెగ్యులర్ మ్యాచ్లు నిర్వహించడం టెస్టు క్రికెట్ కు ప్రయోజనకరంగా ఉంటుందా అని రోహిత్ శర్మను ప్రశ్నించగా.. దీనిపై రోహిత్ స్పందిస్తూ.. 'ఇది మంచి జట్టు అని నేను నమ్ముతున్నాను. ఇరు జట్ల మధ్య చివరి టెస్టు 2007-08లో జరిగింది. పాకిస్థాన్ తో ఆడేందుకు ఇష్టపడతాను. ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటే హోరాహోరీగా ఉంటుంది. ఐసీసీ టోర్నమెంట్లో పాక్ తో ఆడుతున్నాము.. వారితో క్రికెట్ ఆడటానికి ఇష్టపడతాను' అంటూ రోహిత్ పేర్కొన్నాడు.
IPL 2024 : సన్‌రైజర్స్ హైదరాబాద్ VS రాజస్థాన్ రాయల్స్.. గెలుపెవరిది?