Rohit Sharma dances : టీ20 ప్రపంచకప్ 2024 ఛాంపియన్ టీమిండియా ఢిల్లీకి చేరుకుంది. రోహిత్ శర్మతో పాటు భారత ఆటగాళ్లు ఐసీసీ ట్రోఫీతో సందడి చేశారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ డాన్సు కూడా చేశారు.
Rohit Sharma dances : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024లో భారత జట్టు ఛాంపియన్ నిలిచింది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో విజయం సాధించి విజేతగా నిలిచింది. ఇంతకుముందు ఎంఎస్ ధోని సారథ్యంలో టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో రెండో సారి టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను సాధించింది. అయితే, తుఫాను కారణంగా వెస్టిండీస్ లో చిక్కుకుపోయిన టీమిండియా గురువారం ఉదయం ఢిల్లీలో అడుగుపెట్టింది.
ప్రపంచ ఛాంపియన్ జట్టు తిరిగి స్వాదేశానికి ఎప్పుడు వస్తుందా అని క్రికెట్ లవర్స్ తో పాటు యావత్ భారతామని ఎదురుచూస్తున్న సమయంలో బీసీసీఐ ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. దీంతో ఐసీసీ ట్రోఫీతో భారత గడ్డపై అడుగుపెట్టింది భారత జట్టు. మొదటి ఢిల్లీ విమానాశ్రయం చేరుకుంది. అక్కడ రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీతో అభిమానులకు ప్రదర్శించారు. పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చిన అభిమానులతో భారత జట్టుకు గ్రాండ్ స్వాగతం లభించింది.
ఢిల్లీకి చేరుకున్న టీ20 ప్రపంచ కప్ 2024 భారత జట్టు సభ్యులు ఢిల్లీలోని ఐటీసీ మౌర్యకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు బస చేసిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కార్యాలయంలో కలవనున్నారు. అయితే, ఐటీసీ మౌర్య వద్దకూడా భారత జట్టు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన బ్యాండ్, పంజాబీ భాంగ్రాకు రోహిత్ శర్మ స్టెప్పులేశారు. రోహిత్ శర్మతో పాటు భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా తనదైన స్టైల్లో డాన్సుతో అదరగొట్టాడు. అక్కడున్న వారిని ఉత్సాహంతో పలికరించారు. కొంతమంది మహిళలతో కలిసి రోహిత్ శర్మ, హార్దిక్ డాన్సు చేసిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టీ20 ప్రపంచ కప్ తో భారత్ లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో