Team India : టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన రోహిత్ సేన భారత్ లో అడుగు పెట్టింది. దీంతో దేశంలో క్రికెట్ లవర్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రపంచ ఛాంపియన్ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు తిరిగి స్వదేశానికి వస్తున్న నేపథ్యంలో గ్రాండ్ వెల్‌కమ్ లభించింది.
Team India : అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలుగా నిర్వహించిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024లో భారత జట్టు ఛాంపియన్ నిలిచింది. బార్బడోస్‌లో లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ రెండో సారి టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను సాధించింది. అయితే ప్రపంచ ఛాంపియన్ జట్టు తిరిగి స్వాదేశానికి ఎప్పుడు వస్తుందా అని క్రికెట్ లవర్స్ తో పాటు యావత్ భారతామని ఎదురుచూస్తున్న తరుణంలో టీమిండియా భారత గడ్డపై ఐసీసీ ట్రోఫీతో అడుగుపెట్టింది. భారత జట్టుకు గ్రాండ్ స్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత పురుషుల క్రికెట్ జట్టు గురువారం (జూలై 4) ఉదయం ఢిల్లీకి చేరుకుంది. తెల్లవారుజామున ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయానికి చేరుకున్నారు. రెండో టీ20 ప్రపంచకప్ ట్రోఫీ కోసం 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడిన భారత ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఢిల్లీలో దిగిన తర్వాత, భారత కెప్టెన్ రోహిత్ శర్మ విమానాశ్రయం నుండి బయటకు వచ్చి అభిమానుల పెద్ద హర్షధ్వానాల మధ్య టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ప్రదర్శించాడు. భారత్‌లో దిగిన రోహిత్ టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని ప్రదర్శించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఢిల్లీకి చేరుకున్న టీ20 ప్రపంచ కప్ 2024 భారత జట్టు సభ్యులు ఢిల్లీలోని ఐటీసీ మౌర్యకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు బస చేసిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కార్యాలయంలో కలవనున్నారు. భారత జట్టు కోసం ప్రధాని తన కార్యాలయంలో ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ భారత జట్టు ఆటగాళ్లు, సిబ్బందిని సన్మానించనున్నారు. మోడీని కలిసిన తర్వాత, భారత ఆటగాళ్లు ముంబైకి వెళతారు. అక్కడ బహిరంగ బస్ పరేడ్‌లో భారత జట్టు ట్రోఫీతో పాల్గొననుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ సెక్రటరీ జే షా బుధవారం (జూలై 3) ముంబైలో జరిగే చారిత్రాత్మక ఓపెన్ బస్ పరేడ్‌లో భాగం కావాలని అభిమానులకు పిలుపునిచ్చారు.
