Asianet News TeluguAsianet News Telugu

కివీస్‌పై ‘సూపర్‌’ విన్, సిరీస్ సొంతం: విలియమ్సన్ శ్రమ వృధా

నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయడంతో ఇరు జట్ల స్కోర్లు సమానమయ్యాయి. దీంతో అంపైర్లు సూపర్ ఓవర్ ఆడించారు. సూపర్‌ ఓవర్‌లో కివీస్‌‌ నిర్దేశించిన 18 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

New zeland vs India at hamilton: Third T20 updates
Author
Hamilton, First Published Jan 29, 2020, 12:23 PM IST

నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయడంతో ఇరు జట్ల స్కోర్లు సమానమయ్యాయి. దీంతో అంపైర్లు సూపర్ ఓవర్ ఆడించారు.

సూపర్‌ ఓవర్‌లో కివీస్‌‌ నిర్దేశించిన 18 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది. జట్టును గెలిపించేందుకు న్యూజిలాండ్ కెప్టెన్ 95 పరుగుల శ్రమ వృథా అయ్యింది. భారత బౌలర్లలో శార్థూల్, షమీ తలో రెండు వికెట్లు పడగొట్టగా... చాహల్, జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ 5 టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది.

మ్యాచ్ టై:

నరాలు తెగే ఉత్కంఠ మధ్య న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై అయ్యింది. చివరి ఓవర్‌లో 9 పరుగులు సాధించాల్సిన క్రమంలో షమీ వేసిన తొలి బంతికి రాస్ టేలర్ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాతి బంతికి కెప్టెన్ విలియమ్సన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాతి రెండు బంతులకు పరుగులేమీ రాలేదు. ఐదో బంతికి సింగిల్ తీయడంతో టేలర్‌ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. అయితే షమీ చివరి బంతిని యార్కర్‌గా సంధించడంతో టేలర్ క్లీన్ బౌల్డయ్యాడు. మ్యాచ్ టై అవ్వడంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. 

సూపర్ ఓవర్‌లో భారత్ లక్ష్యం 18

బుమ్రా వేసిన తొలి బంతికి విలియమ్సన్ సింగిల్ తీశాడు. ఆ వెంటనే స్ట్రైకింగ్‌కు వచ్చిన గప్టిల్ రెండో బంతికి సింగిల్ తీసి గప్టిల్‌కు స్ట్రైకింగ్‌ ఇచ్చాడు. మూడో బంతికి విలియమ్సన్ సిక్స్, నాలుగో బంతికి ఫోర్, ఐదో బంతికి సింగిల్ తీశాడు. చివరి బంతికి గప్టిల్ ఫోర్ కొట్టడంతో న్యూజిలాండ్ 17 పరుగులు చేసి భారత్‌ ముందు 18 పరుగుల టార్గెట్ ఉంచింది. 

సూపర్‌ఓవర్‌లో భారత్‌ను గెలిపించిన రోహిత్

సౌతీ వేసిన సూపర్‌ ఓవర్‌ తొలి బంతికి రోహిత్ శర్మ రెండు పరుగులు, తర్వాతి బంతికి సింగిల్ తీశాడు. ఆ తర్వాత స్ట్రైకింగ్‌కు వచ్చిన రాహుల్ మూడో బంతికి ఫోర్, నాలుగో బంతికి సింగిల్ తీశాడు. తర్వాత స్ట్రైకింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి జట్టును గెలిపించాడు.

అంతకుముందు లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌కు శుభారంభం లభించింది. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్లను శార్ధూల్ బోల్తా కొట్టించాడు. జట్టు స్కోరు 47 పరుగుల వద్ద ఉండగా.. ధాటిగా ఆడుతున్న మార్టిన్ గప్టిల్‌ 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

గప్టిల్ వెనుదిరిగిన వెంటనే కేవలం 5 పరుగుల తేడాతో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 52 పరుగుల వద్ద ఉండగా.. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవీంద్ర జడేజా వేసిన అద్భుతమైన బంతిని అంచనా వేయడంలో పొరబడిన ఓపెనర్ మున్రో క్రీజును వదలడంతో కీపర్ కేఎల్ రాహుల్ రెప్పపాటులో వికెట్లను గీరాటు వేశాడు. 

కెప్టెన్ విలియమ్సన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్న మిచెల్ శాంట్నర్‌ను చాహల్ బొల్తా కొట్టించాడు. జట్టు స్కోరు 88 పరుగుల వద్ద ఉండగా.. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శాంట్నార్‌  క్లీన్‌బౌల్డయ్యాడు. 

వరుసగా వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడిన కెప్టెన్ విలియమ్సన్ అర్థసెంచరీ చేశాడు. 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అతను 50 పరుగులు చేశాడు. 

కెప్టెన్ విలియమ్సన్‌కు చక్కని సహకారం అందించిన ఆల్‌రౌండర్ గ్రాండ్‌హోమి జట్టు స్కోరు 137 పరుగుల వద్ద ఉండగా ఔటయ్యాడు. శార్దూల్ బౌలింగ్‌లో 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శివమ్ దూబే‌కు క్యాచ్ ఇచ్చి గ్రాండ్ హోమి పెవిలియన్ చేరాడు. దీంతో 49 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 

విజయానికి 2 పరుగుల దూరంలో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ వికెట్ కోల్పోయింది. 48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేసిన విలియమ్సన్ జట్టు స్కోరు 178 పరుగుల వద్ద ఉండగా షమీ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  

అంతకుముందు న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న మూడో టీ20 లోనూ భారత్ కు శుభారంభం లభించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ సేన నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ 65, విరాట్ కోహ్లీ 38, కెఎల్  రాహుల్ 27 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్నెట్ మూడు వికెట్లతో అదరగొట్టాడు. అలాగా సాట్నర్, గ్రాండ్ హోమ్ లు తలో వికెట్ పడగొట్టారు.

తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 65, కేఎల్ రాహుల్ 27 పరుగులతో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. కేవలం 23 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ శర్మ అర్థ సెంచరీలో ఐదు ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయి. 

ఈ క్రమంలో భారత్ 89 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ 19 బంతుల్లో 27 పరుగులు చేసి గ్రాండ్స్ హోమ్ బౌలింగులో మన్రోకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ కాకుండా శివం దూబే బ్యాటింగ్ కు దిగాడు.

94 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతూ వచ్చిన రోహిత్ శర్మ 40 బంతుల్లో 65 పరుగులు చేసి బెన్నెట్ బౌలింగులో వెనుదిరిగాడు. భారత్ 96 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన శివం దూబే విఫలమయ్యాడు. అతను కేవలం3 పరుగులు చేసి బెన్నెట్ బౌలింగ్ లో పెవిలియన్ చేరుకున్నాడు.

చివర్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 38, శ్రేయస్ అయ్యర్ 17 ధాటిగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ క్రమంలో శాంట్నార్ బౌలింగ్‌లో అయ్యార్ స్టంపౌట్ అయ్యాడు. కోహ్టీ కూడా ఆ కాసేపటికే ఔటయ్యాడు. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్‌కు పరుగులు రావడం కష్టమైంది.

ఈ సమయంలో రవీంద్ర జడేడా 10, మనీశ్ పాండే 14 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో బెన్నెట్‌కు 3, శాంట్నర్, గ్రాండ్‌ హోమీలకు చెరో వికెట్ దక్కింది. 

భారత్ తుది జట్టులో మార్పులేమీ చేయకుండా మైదానంలోకి దిగుతోంది. న్యూజిలాండ్ జట్టులో మాత్రం ఓ మార్పు జరిగింది. స్కాట్ కుగ్గెలీన్ స్కాట్ టిక్నర్ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు:

న్యూజిలాండ్: మార్టిన్ గుప్తిల్, కొలిన్ మన్రో, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టైలర్, టిమ్ సీఫోర్ట్, కొలిన్ డే గ్రాండ్స్ హామ్, మిచెల్ సాత్నర్, ిష్ సోధీ, టిమ్ సౌథీ, స్కాట్ కుగ్గెలీన్, హమీష్ బెనెట్

ఇండియా: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, శివం దూబే, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమి, యుజువేంద్ర చాహల్, జస్ ప్రీత్ బుమ్రా

Follow Us:
Download App:
  • android
  • ios