Asianet News TeluguAsianet News Telugu

IPL 2024: స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శ‌ర్మ ఫైర్.. అస‌లు గొడవేంటి..?

Rohit Sharma : ఐపీఎల్ 2024లో ఆటగాళ్ల వీడియోలు సోషల్ మీడియాలో నిరంతరం వైరల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ  స్టార్‌ స్పోర్ట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అస‌లు ఏం జ‌రిగింది? 
 

IPL 2024: India captain Rohit Sharma slams Star Sports What actually happened?  RMA
Author
First Published May 19, 2024, 11:46 PM IST

India captain Rohit Sharma: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) సంద‌ర్భంగా మ్యాచ్ వీడియోల‌తో పాటు మ్యాచ్ తర్వాత‌ ఆటగాళ్ల వీడియోలు సోషల్ మీడియాలో నిరంతరం వైరల్ అవుతున్నాయి. అది ప్రాక్టీస్ సెషన్ అయినా లేదా మ్యాచ్ తర్వాత అయినా.. వాటితో ప‌నిలేకుండా వైర‌ల్ అయిన సంద‌ర్బాలు చాలానే ఉన్నాయి. ఆటగాళ్ల ప్రతి స్పందనను కూఆ రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇలాంటివి వివాదాల‌ను కూడా రేపాయి. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇలాంటి వీడియోల‌ బాధితుడయ్యాడు. హిట్ మ్యాన్ కు సంబంధంచిన ఒక‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. అందులో హిట్‌మ్యాన్ కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో  మాట్లాడుతున్నాడు.

ఈ వీడియో తర్వాత, మరొక వీడియో వైరల్ అయ్యింది, అందులో హిట్‌మ్యాన్ కెమెరామెన్‌ని మ్యూట్ చేయమని ఆడిగాడు.. అయితే, అది జ‌ర‌గ‌క‌పోవ‌డంతో పాటు గోప్యతా ఉల్లంఘన జ‌రిగింది. దీంతో హిట్‌మ్యాన్ ఈ వీడియోను రికార్డు చేసిన‌ స్టార్ స్పోర్ట్స్‌పై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్యక్తం చేశాడు. 

విరాట్ కోహ్లీ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.. ఐపీఎల్ లో నెంబ‌ర్.1 ప్లేయ‌ర్ గా అభిషేక్ శ‌ర్మ

రోహిత్ ఆగ్రహం.. 

రోహిత్ శర్మ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో స్టార్ స్పోర్ట్స్ తీరుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. "క్రికెటర్ల జీవితాలు చాలా అసౌక‌ర్యంగా మారాయి. ఎందుకంటే మ్యాచ్ రోజులలో ప్రాక్టీస్‌లో లేదా ఒంటరిగా మా స్నేహితులు, సహోద్యోగులతో మనం చేసే ప్రతి కదలికను-సంభాషణను కెమెరాలు ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాయి. నా సంభాషణను రికార్డ్ చేయవద్దని స్టార్ స్పోర్ట్స్‌ని కోరినప్పటికీ, అది ప్రసారంలో ప్లే చేయబడింది, ఇది గోప్యత ఉల్లంఘన. ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ను పొందడం, కేవలం వ్యూస్, ఎంగేజ్ మెంట్ లపై మాత్రమే దృష్టి పెట్టడం ఏదో ఒక రోజు అభిమానులు, క్రికెటర్లు, క్రికెట్ మధ్య నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఇలా జ‌ర‌గ‌కుండా ఉండ‌నివ్వండి" అని రోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ విన్నర్ రేసులో విరాట్ కోహ్లీ.. ఇప్ప‌టివ‌ర‌కు విజేత‌లు వీరే

 

 

ధోని ఐపీఎల్ కెరీర్ ముగిసిన‌ట్టేనా?.. స్టార్ ప్లేయ‌ర్ ఏం చెప్పాడో చూడండి.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios