Asianet News TeluguAsianet News Telugu

ధోని ఐపీఎల్ కెరీర్ ముగిసిన‌ట్టేనా?.. స్టార్ ప్లేయ‌ర్ ఏం చెప్పాడో చూడండి.. !

MS Dhoni : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024 నుండి నిష్క్రమించింది. ఇప్పుడు అభిమానుల మదిలో ఒకే ఒక్క ప్రశ్న ధోనీకి ఈ సీజన్ చివరిదా?  లేదా వ‌చ్చే సీజ‌న్ లోనూ ఆడ‌తాడా? 
 

Is CSK MS Dhoni's IPL career over?.. Look at what the star player Matthew Hayden has to say RMA
Author
First Published May 19, 2024, 11:17 PM IST

Dhoni IPL Career : అంత‌ర్జాతీయ క్రికెట్ వీడ్కోలు చెప్పిన‌ప్ప‌టికీ టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ప్లేయ‌ర్ ఎంఎస్ ధోని క్రేజ్ ఏమాత్రం త‌గ్గలేదు. ప్ర‌స్తుతం ఐపీఎల్ లో ఆడుతున్న ధోని సీఎస్కే లో కొన‌సాగుతున్నాడు. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024 నుండి నిష్క్రమించింది. ఇప్పుడు అభిమానుల మదిలో ఒకే ఒక్క ప్రశ్న ధోనీకి ఈ సీజన్ చివరిదా?  లేదా వ‌చ్చే ఐపీఎల్ లో ఆడ‌తాడా?. దీనికి సంబంధించి సీఎస్‌కే మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ బిగ్ న్యూస్ చెప్పాడు. ధోనీ తన చివరి మ్యాచ్ ఆడాడని హేడెన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2024లో ధోని అద్భుతంగా బ్యాటింగ్ తో ఫోర్లు, సిక్సర్లు కొట్టి అభిమానులను అలరించాడు.తమ హీరోని చూసేందుకు ప్రతి మ్యాచ్ లో అభిమానులు సంద‌డి మాములుగా ఉండేది కాదు. ధోని వ‌స్తున్నాడంటే చాలు స్టేడియం హోరెత్తేది. 

ధోని పై మాథ్యూ హేడెన్ కామెంట్స్ వైర‌ల్

మాజీ ఓపెన‌ర్, ఆస్ట్రేలియా లెజెండ్ మాథ్యూ హేడెన్.. ధోని ఐపీఎల్ కెరీర్ గురించి మాట్లాడుతూ.. ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన చివరి మ్యాచ్‌ని ఆడాడని చెప్పాడు. అయితే అతను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో ఏదో ఒక పాత్రలో ధోని త‌న‌ అనుబంధం కొనసాగిస్తాడని అభిప్రాయపడ్డాడు. శుక్రవారం జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోవడంతో ఈ ఐపీఎల్‌లో చెన్నై ప్రయాణం ముగిసింది. ఈ మ్యాచ్‌లో ధోనీ 13 బంతుల్లో 25 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు, కానీ అది జట్టును ప్లేఆఫ్‌కు తీసుకెళ్లడానికి ఆ ప‌రుగులు స‌రిపోలేదు. 219 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి 201 పరుగులు చేయాల్సి ఉండగా, ఆ జట్టు ఏడు వికెట్లకు 191 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ విన్నర్ రేసులో విరాట్ కోహ్లీ.. ఇప్ప‌టివ‌ర‌కు విజేత‌లు వీరే

ధోనీ అద్భుతమైన ఆటతీరు.. 

ఆఖరి ఓవర్‌లో ఆ జట్టు ఫైనల్ చేరేందుకు 17 పరుగులు చేయాల్సి ఉంది. యశ్ దయాల్ బౌలింగ్ లో ధోని ఈ సీజన్‌లోనే భారీ సిక్స‌ర్ కొట్టాడు. 110 మీటర్ల పొడవైన సిక్సర్ కొట్టడం ద్వారా చెన్నై ఆశలను సజీవంగా ఉంచాడు, కాని తర్వాతి బంతికే ధోని ఔట్ కావ‌డంతో చెన్నై పోరాటం ముగిసింది. ప్రస్తుత సీజన్‌లో, ధోని 220.55 అద్భుతమైన స్ట్రైక్ రేట్, 53.67 సగటుతో 161 పరుగులు చేశాడు. 

ఓ కార్యక్రమంలో హేడెన్ మాట్లాడుతూ, 'ధోనీ తన చివరి మ్యాచ్‌ ఆడాడని నేను అనుకుంటున్నాను. ఐపీఎల్‌లో ధోనీని మనం చివరిసారిగా చూస్తున్నాం. అతను అధికారిక హోదాలో సీఎస్కే కుటుంబంలో మార్గనిర్దేశం చేయకపోతే లేదా ఒక భాగం కాకపోతే నేను చాలా ఆశ్చర్యపోతాను. మీరు ఒకరి కెరీర్ ముగింపును చూస్తున్నప్పుడు, ఆ ఆటగాడు వైఫల్యంతో వీడ్కోలు పొందాలని మీరు కోరుకోరు' అని అతను చెప్పాడు.

విరాట్ కోహ్లీ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.. ఐపీఎల్ లో నెంబ‌ర్.1 ప్లేయ‌ర్ గా అభిషేక్ శ‌ర్మ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios