విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.. ఐపీఎల్ లో నెంబర్.1 ప్లేయర్ గా అభిషేక్ శర్మ
SRH vs PBKS: సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ 2024 ఆడుతున్న 23 ఏళ్ల అభిషేక్ శర్మ మరోసారి పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో తన బ్యాట్ పవర్ చూపిస్తూ సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి పేరిట ఉన్న భారీ ఐపీఎల్ రికార్డును బద్దలు కొట్టాడు.
SRH vs PBKS : ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. పంజాబ్‌తో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్ ను కూడా విజయంతో ముగించింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి అద్భుతమైన బ్యాటింగ్ తో టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్ అభిషేక్ శర్మ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రభ్ సిమ్రాన్ 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 71 పరుగులు, అథర్వ 46 పరుగులు, రోసోవ్ 49 పరుగులు, జితేష్ శర్మ 32 పరుగులు చేసి జట్టు స్కోరును 214కు చేర్చాడు.
215 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన మార్కును చూపిస్తూ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ యంగ్ ప్లేయర్ కేవలం 28 బంతుల్లో 6 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 66 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి (33), నితీష్ రెడ్డి (37), హెన్రిచ్ క్లాసెన్ (42) తమ బ్యాటింగ్‌తో హైదరాబాద్ కు విజయాన్ని అందించారు. పంజాబ్‌ను ఓడించి హైదరాబాద్ జట్టు రాజస్థాన్‌ను వెనక్కినెట్టింది. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో హైదరాబాద్ రెండో స్థానానికి చేరుకుంది.
కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్..
అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ తో కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తున్న అభిషేక్ శర్మ.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతులు ఎదుర్కొని 66 పరుగులు చేసి హైదరాబాద్ విజయంలో కీలకంగా మారాడు. తన ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్లతో, ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ 8 ఏళ్ల నాటి రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు. ఈ సీజన్ లో అభిషేక్ శర్మ ఇప్పటివరకు 41 సిక్సర్లు బాదాడు.
ఐపీఎల్ ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత క్రికెటర్లు:
అభిషేక్ శర్మ - 41* (2024)
విరాట్ కోహ్లీ - 38 (2016)
విరాట్ కోహ్లీ - 37* (2024)
రిషబ్ పంత్ - 37 (2018)
శివమ్ దూబే - 35 (2023)