Asianet News TeluguAsianet News Telugu

IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ టెస్టు టిక్కెట్ల ధ‌ర‌లు రూ.200 నుంచే.. వీరికి ఉచితంగానే.. !

India vs England: భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ నెల 25 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ లో టీమిండియా ఇంగ్లాండ్ తో హైదరాబాద్ వేదిక‌గా తలపడనుంది. అయితే, మ్యాచ్ టిక్కెట్ల ధ‌ర‌లు, ఎక్క‌డ బుక్ చేసుకోవాలనేటువంటి వివ‌రాలు మీకోసం.. 
 

IND vs ENG: Minimum prices of India-England Test tickets are Rs 200, do you know where to buy? Full details for you  RMA
Author
First Published Jan 20, 2024, 6:04 PM IST

India vs England: జనవరి 25 నుంచి హైదరాబాద్ లోని రాజీవ్గాంధీ క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. భారత స్పిన్నర్లు ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్.. భార‌త బ్యాట‌ర్స్-ఇంగ్లాండ్ బౌలింగ్.. ఉత్కంఠభరితంగా సాగ‌బోయే టెస్టు సిరీస్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లండ్ జట్టు కూడా ఈసారి ఇద్దరు స్పిన్నర్లతో భారత్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తోంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. మీరు కూడా స్టేడియంలో కూర్చొని తొలి టెస్టును ఆస్వాదించాలనుకుంటే మీకో గుడ్ న్యూస్..!

భార‌త్-ఇంగ్లాండ్ తొలి టెస్టుకు సంబంధించిన టిక్కెట్ల అమ్మ‌కాలు మొద‌ల‌య్యాయి.  మీరు టిక్కెట్లు ఎలా, ఎక్కడి నుంచి బుక్ చేసుకోవాలి?  టిక్కెట్ల ధ‌ర‌లు ఎలా ఉన్నాయ‌నే వివ‌రాలు మీకోసం.. 

సానియా మీర్జా భ‌ర్త షోయబ్ మాలిక్ మూడో పెళ్లి.. ఎవ‌రీ స‌నా జావేద్?

ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడం ఎలా?

పేటీఎం ఇన్ సైడ‌ర్ యాప్ లో ద్వారా భారత్- ఇంగ్లాండ్ మధ్య జరిగే తొలి టెస్టు మ్యాచ్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. www.insider.in సందర్శించి ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రాయ్ తెలిపారు. జనవరి 18 నుంచే టిక్కెట్ల అమ్మ‌కాలు ప్రారంభం అయింద‌ని పేర్కొన్నారు.

ఆఫ్లైన్ టికెట్లు ఎలా పొందాలి?

ఆన్ లైన్ లో భార‌త్-ఇంగ్లాండ్ మ్యాచ్ టిక్కెట్లు కొనుగోలు చేయ‌డం కుద‌ర‌క‌పోతే ఆఫ్ లైన్ లో కూడా టిక్కెట్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇందుకోసం మీ ఐడీతో జింఖానా గ్రౌండ్ కు వెళ్లాలి. అయితే, ఆఫ్లైన్ లో టిక్కెట్ల తీసుకోవాల‌నుకుంటే ఈ నెల 22 వ‌ర‌కు ఆగాల్సిందే. ఆఫ్లైన్ లో జనవరి 22 నుండి భార‌త్-ఇంగ్లాండ్స్ టెస్టు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.

IND VS ENG: భారత్-ఇంగ్లాండ్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు ఎవరో తెలుసా?

టిక్కెట్ల ధ‌ర‌ల ఎలా ఉన్నాయి..? 

  • నార్త్ పెవిలియన్ టికెట్ ధర (టెర్రస్) - రూ.200-600
  • సౌత్ పెవిలియన్ టికెట్ (టెర్రస్) - రూ.200-600
  • సౌత్ పెవిలియన్ టికెట్ (గ్రౌండ్ ఫ్లోర్) - రూ.1250-3750
  • సౌత్ పెవిలియన్ (మొదటి అంతస్తు) - రూ.1250 - 3750
  • నార్త్ పెవిలియన్ కార్పొరేట్ బాక్స్ టికెట్ - రూ.3,000 నుంచి రూ.12,000
  • సౌత్ పెవిలియన్ కార్పొరేట్ బాక్స్ టికెట్ - రూ.4,000 నుంచి రూ.16,000

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే.. 

  1. భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు: జనవరి 25-29, హైదరాబాద్
  2. భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టు: ఫిబ్రవరి 2-6, విశాఖపట్నం
  3. భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు: ఫిబ్రవరి 15-19, రాజ్ కోట్
  4. భారత్-ఇంగ్లాండ్ నాలుగో టెస్టు: ఫిబ్రవరి 23-27, రాంచీ
  5. భారత్-ఇంగ్లాండ్ ఐదో టెస్టు: మార్చి 7-11, ధర్మశాల
     

విరాట్ జంపింగ్.. బుమ్రా బౌలింగ్ ! మ్యాచ్‌ని మలుపు తిప్పిన కింగ్ కోహ్లీ.. ! 

భార‌త్-ఇంగ్లాండ్ మ్యాచ్ ఉచిత టిక్కెట్లు ఎవరికి అందుబాటులో ఉంటాయి..? 

జనవరి 25 నుంచి 29 వరకు హైదరాబాద్ వేదికగా భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. జనవరి 26న సాయుధ దళాల సిబ్బంది ఈ మ్యాచ్ ను ఉచితంగా ఆస్వాదించవచ్చు. అంతే కాదు 5 వేల మంది స్కూల్ పిల్లలు కూడా ఈ టెస్ట్ మ్యాచ్ ను ఒక్క రోజులో ఉచితంగా టిక్కెట్లు పొందవచ్చు. పాఠశాల విద్యార్థులు తమ దుస్తులు, ఐడీ కార్డుతో స్టేడియానికి రావాల్సి ఉంటుంది.

తొల‌గించ‌డం స‌రైందే.. ఇషాన్ కిషన్ పై సునీల్ గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్.. !

Follow Us:
Download App:
  • android
  • ios