టీమిండియా  క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లను ఇంకా కాఫీ విత్ కరణ్ షో వివాదం వదలడం లేదు. ఈ టీవి షోలో మహిళను ఉద్దేశించి  అనుచిత వ్యాఖ్యలు చేసిన పాండ్యాతో పాటు రాహుల్ లకు ఒక్కొక్కరికి 20లక్షల జరిమానా విధిస్తున్నట్లు బిసిసిఐ అంబుడ్స్ మెన్ డికె జైన్ వెల్లడించారు. ఈ జరిమానాకు సంబంధించిన వివరాలను బిసిసిఐ అధికారికి వెబ్ సైట్ లో పొందుపర్చినట్లు జైన్ తెలిపారు. 

జస్టిస్ జైన్ పాండ్యా, రాహుల్  వ్యవహారంపై మాట్లాడుతూ... వీరిపై ఇవే  చివరి చర్యలని తెలిపారు. ఇక తదుపరి ఈ విషయంలో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోమని స్ఫష్టం చేశారు. ఇప్పటికే వారిద్దరు మహిళలకు క్షమాపణలు కోరినప్పటికి నిషేదానికి గురయ్యారు. ఇప్పుడు మళ్లీ జరిమానా విధించాం. కాబట్టి ఈ వ్యవహరంలో ఇవే చివరి చర్యలని ఆయన వెల్లడించారు. 

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 10మంది ఫారా మిలిటరీ కానిస్టేబుల్స్ కుటుంబాలకు లక్ష చొప్పును ఆర్థిక సాయం అందించాలని అంబుడ్స్ మెన్ హార్ధిక్, రాహుల్ లను ఆదేశించారు. అలాగే చెరో పది లక్షల రూపాయలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బ్లైండ్ కు అందిచాలని ఆదేశించింది. ఇలా వారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు మొత్తం 20 లక్షల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు జస్టిస్ జైన్ వివరించారు. 

తాము విధించిన జరిమానా మొత్తాన్ని నాలుగు వారాల్లోపు చెల్లించాలని పాండ్యా, రాహుల్ లకు ఆదేశించారు. తాము విధించిన సమయం లోపు వారు జరిమానా చెల్లించకుంటే వారి మ్యాచ్ పీజ్ లోంచి ఆ మొత్తాని వసూలు చేస్తామని తెలిపారు. కాబట్టి వీరిద్దరు తగిన సమయంలో జరిమానాను చెల్లించాలని కోరుతున్నట్లు జస్టిస్ జైన్ పేరుతో బిసిసిఐ అధికారికంగా ప్రకటన చేసింది.

సంబంధిత వార్తలు 

బిగ్ రిలీఫ్: రాహుల్, పాండ్యాలపై సస్పెన్షన్ ఎత్తివేత

పాండ్యా వివాదంపై మొదటిసారి స్పందించిన కరణ్ జోహర్...

హర్దిక్ పాండ్యాకు మరో షాక్

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు

పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేల నిషేదం...సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్