Asianet News TeluguAsianet News Telugu

బిగ్ రిలీఫ్: రాహుల్, పాండ్యాలపై సస్పెన్షన్ ఎత్తివేత

పాండ్యా, రాహుల్‌పై నిషేధం ఎత్తివేయాలని బీసీసీఐ కోరింది. పలువురు మాజీ క్రికెటర్లు కూడా సీవోఏను కోరారు. తాజాగా వీరిద్దరిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినట్టు బీసీసీఐ తెలిపింది.

Suspension lifted on KL Rahul and Pandya
Author
Mumbai, First Published Jan 24, 2019, 5:59 PM IST

న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌కు పెద్ద ఊరట లభించింది. వారిపై సుప్రీంకోర్టు నియమిత పాలక మండలి (సీవోఏ) సస్పెన్షన్ ను ఎత్తేసింది. టీవీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి ఆ ఇద్దరు క్రీడాకారులు వివాదంలో చిక్కుకున్నారు. దేశవ్యాప్తంగా వీరిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 

దాంతో రాహుల్, పాండ్యా వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన సీవోఏ ఇద్దరి మీద నిషేధం విధించింది. ఆసీస్ పర్యటనలో ఉన్న వీరిద్దరినీ బీసీసీఐ అర్ధాంతరంగా వెనక్కి పిలిపించింది. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో చోటు కోల్పోయిన ఈ ఇద్దరినీ న్యూజిలాండ్ పర్యటనకు కూడా ఎంపిక చేయలేదు. 

పాండ్యా, రాహుల్‌పై నిషేధం ఎత్తివేయాలని బీసీసీఐ కోరింది. పలువురు మాజీ క్రికెటర్లు కూడా సీవోఏను కోరారు. తాజాగా వీరిద్దరిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినట్టు బీసీసీఐ తెలిపింది.

సస్పెన్షన్ ఎత్తివేతతో పాండ్యా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో తలపడుతున్న విషయం తెలిసిందే. కెఎల్ రాహుల్ దేశవాళీ క్రికెట్ లో గానీ, ఇండియా ఎ జట్టులో గానీ ఆడవచ్చునని తెలుస్తోంది. ఆ ఇద్దరి క్రికెటర్ల భవిష్యత్తును బిసిసిఐ ఆఫీస్ బియరర్స్ నిర్ణయిస్తారు. 

సంబంధిత వార్తలు

పాండ్యా వివాదంపై మొదటిసారి స్పందించిన కరణ్ జోహర్...

హర్దిక్ పాండ్యాకు మరో షాక్

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు

పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేల నిషేదం...సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్

Follow Us:
Download App:
  • android
  • ios