IND vs ENG: భారత్ కు డబుల్ షాక్...
India vs England: హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరిగే రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండరని బీసీసీఐ తెలిపింది.
India vs England 2nd Test: తొలి టెస్టు ఓటమి నుంచి కోలుకుని భారత్ కు మరో షాక్ తగిలింది. రెండో టెస్టు కు కీలక ప్లేయర్లు దూరం అయ్యారు. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరగనున్న రెండో టెస్టులో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, కీపర్ బ్యాటర్ లోకేశ్ రాహుల్ ఆడడం లేదు. ఆదివారం జరిగిన తొలి టెస్టులో జడేజా తొడ కండరాల గాయానికి గురికాగా, రాహుల్ కుడి తొడలో నొప్పితో బాధపడుతున్నాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
ఫిబ్రవరి 2 నుంచి విశాఖలో రెండో టెస్టు
2024 ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో భారత్ రెండో టెస్టు ఆడనుంది. మొదటి టెస్టు ఓటమి, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడం.. ఇదే సమయంలో కీలక ప్లేయర్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ కూడా రెండో టెస్టుకు అందుబాటులో లేకపోవడం మరో ఎదురుదెబ్బ అనే చెప్పాలి. వైజాగ్ టెస్టుకు జడేజా, రాహుల్ అందుబాటులో ఉండరని స్పష్టం చేసిన బీసీసీఐ.. ఈ ఇద్దరు ప్లేయర్లు తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారని తెలిపింది.
విరాట్ కోహ్లీ నాపై ఉమ్మేశాడు.. సౌతాఫ్రికా క్రికెటర్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు
మరో ముగ్గురు ప్లేయర్లకు ఛాన్స్
రాహుల్, జడేజాలు జట్టుకు దూరం కావడంతో వారి స్థానంలో సెలక్షన్ కమిటీ ముంబై బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్, లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లను రెండో టెస్టు కోసం భారత జట్టులో తీసుకున్నట్టు తెలిపింది. హైదరాబాద్ లో తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో ఓడిన భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకంజలో ఉంది. ప్రస్తుతం అవేశ్ ఖాన్ మధ్య ప్రదేవ్ తరఫున రంజీ మ్యాచ్ ఆడుతున్నాడనీ, అవసరమైతే జట్టులోకి వస్తాడని కూడా పేర్కొంది.
ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, అవేశ్ ఖాన్ , రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్.
టెస్టు క్రికెట్ కెరీర్ లో రవీంద్ర జడేజాకు ఇదే తొలిసారి.. !