Asianet News TeluguAsianet News Telugu

విరాట్ కోహ్లీ నాపై ఉమ్మేశాడు.. సౌతాఫ్రికా క్రికెటర్ డీన్ ఎల్గ‌ర్ సంచలన వ్యాఖ్యలు

Virat Kohli Dean Elgar: భారత్‌తో జరిగిన సిరీస్ తర్వాత ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ త‌నపై ఉమ్మేశాడ‌ని పేర్కొన్నాడు. 
 

Team India's star player Virat Kohli spat At me: Former South Africa captain Dean Elgar RMA
Author
First Published Jan 29, 2024, 9:12 PM IST

Virat Kohli Spit on Dean Elgar: టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ పై ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌పై ఉమ్మేశాడ‌నీ, తీవ్ర ప‌ద‌జాలంతో దూషించాడంటూ పేర్కొన‌డం క్రికెట్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్ పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అయితే, ఇది ఇప్పుడు జ‌రిగింది కాద‌నీ, తాను భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చినప్పుడు జ‌రిగిన ఘ‌ట‌న అంటూ దాని గురించి వివ‌రించాడు.

ఓ టెస్టు మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనపై ఉమ్మివేసాడని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ ఆరోపించాడు. అయితే, ఈ ఘ‌ట‌న జ‌రిగిన రెండేళ్ల తర్వాత తన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సహచరుడు ఏబీ డివిలియర్స్ తోనూ ప్ర‌స్తావించాడ‌నీ, ఇటీవలే కోహ్లి క్షమాపణలు చెప్పాడ‌ని పేర్కొన్నాడు. గ‌తేడాది డిసెంబర్ లో స్వదేశంలో భారత్‌తో జరిగిన రెండు-టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికాకు నాయకత్వం వహించిన తర్వాత డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు.

India vs England: అశ్విన్-జ‌డేజా జోడీ చెత్త రికార్డు..

తాజాగా 'బ్యాంటర్ విత్ ది బాయ్స్' పోడ్‌కాస్ట్‌లో  డీన్ ఎల్గ‌ర్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ త‌న‌పై ఉమ్మేసిన ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావించాడు. 2015లో టెస్టు సిరీస్ కోసం భార‌త పర్య‌ట‌న కోసం తాను వ‌చ్చాన‌ని చెప్పిన డీన్ ఎల్గ‌ర్.. భార‌త స్టార్ స్పిన్న‌ర్లు ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్ ఎదుర్కొవ‌డం క‌ష్టంగా మారింద‌ని పేర్కొన్నాడు. ఈ క్ర‌మంలో విరాట్ కోహ్లీ త‌న‌పై ఉమ్మేశాడ‌ని చెప్పాడు. అయితే, తాను త‌న భాష‌లో బూత్ ప‌దం వాడి బ్యాట్ తో కొడ‌తా  అంటూ  అన్నాన‌ని ఎల్గ‌ర్ చెప్పాడు. ఈ స‌మ‌యంలో కోహ్లీ కూడా త‌న‌ను తిట్టాడ‌ని పేర్కొన్నాడు.

అయితే, ఇటీవ‌ల ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన భార‌త జ‌ట్టులో భాగంగా ఉన్న విరాట్ కోహ్లీ రెండేండ్ల త‌ర్వాత త‌న‌కు సారీ చెప్పాడ‌ని డీన్ ఎల్గ‌ర్ చెప్పాడు. డివిలియర్స్ కోహ్లీతో ఎప్పుడు దీని గురించి చ‌ర్చించిన వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు. త‌న‌పై ఉమ్మేసిన రెండేండ్ల త‌ర్వాత కోహ్లీ త‌న‌కు క్షమాపణలు చెప్పాడ‌నీ, ఆ రోజు రాత్రి 3 గంట‌ల వ‌ర‌కు క‌లిసి మాట్లాడు కోవ‌డంతో పాటు కాస్త డ్రింక్ కూడా చేశామ‌ని ఎల్గ‌ర్ చెప్పాడు. కోహ్లి, అశ్విన్‌లతో దక్షిణాఫ్రికా తరఫున చివరి టెస్టు ఆడిన అనుభవం ఎలా ఉందని ఎల్గ‌ర్ ను అడ‌గ్గా.. అద్భుతంగా ఉంద‌నీ, డిసెంబర్ 2023లో కేప్ టౌన్‌లో జరిగిన తన చివరి టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఎల్గర్ క్యాచ్ తీసుకున్న తర్వాత కోహ్లీ స్పష్టంగా సంబరాలు చేసుకోలేద‌నీ, పెవిలియన్‌కు తిరిగి వచ్చినప్పుడు కౌగిలించుకున్నాడ‌ని చెప్పాడు.

టెస్టు క్రికెట్ కెరీర్ లో రవీంద్ర జడేజాకు ఇదే తొలిసారి.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios