CSK Winning on last ball by scoring Six
Bravo vs KKR (2012)
Santner vs RR (2019)
Jadeja vs KKR (2020)*
CSKvsKKR : చెన్నై సూపర్ కింగ్స్‌కి ఊరట విజయం... కీలక మ్యాచ్‌లో ఓడిన కోల్‌కత్తా...

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకోగా, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓడితే పంజాబ్ అవకాశాలు మెరుగవుతాయి.
సీఎస్‌కే... మూడోసారి...
ఆఖరి బంతికి సిక్స్ కొడితే...
ఆఖరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగిస్తే ఆ కిక్కే వేరబ్బా... అంటున్నాడు రవీంద్ర జడేజా...
చెన్నై, ముంబై అనుబంధం...
Sunday:
#MI lose, #CSK eliminated
Today:
#CSK win, #MI qualify for Play-Offs
ముంబైకి బోనస్...
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఓడిపోవడంతో ఈ ఫలితం తర్వాత ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌కి అధికారికంగా అర్హత సాధించింది. సీఎస్‌కే మినహా మిగిలిన ఆరు జట్ల మధ్య మిగిలిన మూడు స్థానాల కోసం పోటీ నెలకొంది.
సిక్సర్ బాది...
ఆఖరి బంతికి సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు రవీంద్ర జడేజా. 5 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్.
జడేజా సిక్సర్...
రవీంద్ర జడేజా ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆఖరి బంతికి సింగిల్ కావాలి...
2 బంతుల్లో 7 పరుగులు...
సీఎస్‌కే విజయానికి 2 బంతుల్లో 7 పరుగులు కావాాలి...
ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు...
సీఎస్‌కే విజయానికి ఆఖరి 6 బంతుల్లో 10 పరుగులు కావాలి...
2 ఓవర్లలో 30...
చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 30 పరుగులు కావాలి...
గైక్వాడ్ అవుట్...
గైక్వాడ్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...
18 బంతుల్లో 34...
సీఎస్‌కే విజయానికి చివరి 3 ఓవర్లలో 34 పరుగులు కావాలి...
24 బంతుల్లో 45...
సీఎస్‌కే విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 45 పరుగులు కావాలి...
30 బంతుల్లో 52...
చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 5 ఓర్లలో 52 పరుగులు కావాలి...
ధోనీ ఒక్క పరుగుకే...
ధోనీ ఒక్క పరుగుకే... 121 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...
36 బంతుల్లో 53...
చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 6 ఓవర్లలో 53 పరుగులు కావాలి....
అంబటిరాయుడు అవుట్... రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...
అంబటిరాయుడు అవుట్...118 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...
సీజన్‌లో ఆరో భారత బ్యాట్స్‌మెన్...
Indians Scoring Consecutive 50s in 2020 IPL
Kl Rahul
Sanju Samson
Shikhar Dhawan
Devdutt Padikkal
Suryakumar Yadav
Ruturaj Gaikwad*
అంబటి రాయుడు సిక్సర్...
అంబటి రాయుడు ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 11.4 ఓవర్లలో 98 పరుగులకి చేరుకుంది సీఎస్‌కే...
గైక్వాడ్ ‘స్పార్కింగ్’ సెకండ్ హాఫ్...
రుతురాజ్ గైక్వాడ్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదాడు రుతురాజ్.
11 ఓవర్లలో 88...
11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...