Asianet News TeluguAsianet News Telugu

ఇట్ల చేస్తున్న‌వేంది ఇషాన్ కిష‌న్.. జ‌ట్టులోకి రావ‌ద్ద‌నుకుంటున్నావా ఏందీ.. !

Ishan Kishan: ఇషాన్ కిష‌న్ తీరుపై బీసీసీఐ అగ్గిలం మీద గుగ్గిలం అవుతోంది. ఇషాన్ ప్రస్తుతం బరోడాలోని రిలయన్స్ స్టేడియంలో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాతో కలిసి శిక్షణ తీసుకుంటున్నాడు.

BCCI Team Management, Rahul Dravid angry over Ishan Kishan's witout any intimation RMA
Author
First Published Feb 8, 2024, 3:18 PM IST

Ishan Kishan - Team India: భార‌త యంగ్ ప్లేయ‌ర్, స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ తీరుపై బీసీసీఐ మండిప‌డుతోంది. ఎలాంటి స‌మాచారం అందించ‌కుండా అత‌ను న‌డుచుకుంటున్న తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ప్రస్తుతం టీమ్ ఇండియాకు దూరంగా ఉన్న ఇషాన్ కిష‌న్.. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికా టూర్ కు భారత జట్టుతో వెళ్లాడు. పర్యటన ప్రారంభంలో కాస్త విరామం తీసుకుని తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఇషాన్ కిషన్ కు సంబంధి బీసీసీఐ వ‌ర్గాల‌కు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు స‌మాచారం ఇవ్వ‌లేద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దాదాపు నెలన్నర తర్వాత ఇషాన్ కిష‌న్ అచూకీ తెలిసింది.

ప్ర‌స్తుత మీడియా కథనాల ప్రకారం ఇషాన్  కిష‌న్ బరోడాలోని ప్రాక్టీస్ చేస్తున్నాడు. రిలయన్స్ స్టేడియంలో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాతో కలిసి శిక్షణ తీసుకుంటున్నాడని స‌మాచారం. హార్దిక్ పాండ్యా రానున్న ఐపీఎల్ తో మ‌ళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్ట‌నున్నాడు. ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ కెప్టెన్ కాగా, ఇషాన్ కూడా అదే జట్టుకు ఆడుతున్నాడు. టీమిండియాకు స‌మాచారం ఇవ్వ‌కుండా ఉన్న ఇష‌న్ కిష‌న్ తీరుపై బీసీసీఐ వ‌ర్గాలు ఆగ్ర‌హంతో ఉన్నాయి. ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇప్ప‌టికే దేశ‌వాళీ మ్యాచ్ ల‌ను ఆడిన త‌ర్వాతే జ‌ట్టులోకి తీసుకుంటామ‌ని తెల్చిచెప్పాడు. అయితే, ఇషాన్ కిష‌న్ అలా చేయ‌క‌పోవ‌డం బీసీసీఐ, టీమ్ మేనేజ్మెంట్ ను మ‌రింత ఆగ్ర‌హానికి గురిచేసింది.

కుర్చీని మ‌డ‌త‌పెట్టి.. విరాట్ కోహ్లీ-అనుష్క‌ల డాన్స్ అదిరిపోయిందిగా.. ! వీడియో

తాజా మీడియా కథనాల ప్రకారం, ఇషాన్ ఇప్పుడు నేరుగా ఐపీఎల్ లో ఆడనున్నాడు. ఇక్క‌డ ఆట‌ను దృష్టిలో ఉంచుకుని టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం టీమిండియా పెంపిక జ‌ర‌గ‌నుంది. అయితే తన లభ్యతకు సంబంధించి ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. భార‌త్-ఇంగ్లాండ్ సిరీస్ లో టీమిండియా రెండో టెస్టులో గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడిన ద్ర‌విడ్..  దక్షిణాఫ్రికా పర్యటనలో విశ్రాంతి కోరాడ‌నీ, అప్ప‌టి నుంచి స‌మాచారం లేద‌ని తెలిపాడు. టీమిండియాలోకి రావ‌డానికి ముందు దేశ‌వాళీ మ్యాచ్ లను ఆడవ‌ల‌సి ఉంటుంద‌నీ, ఆ తర్వాతే జ‌ట్టులోకి తీసుకునే ప‌రిశీల‌న ఉంటుంద‌ని తెలిపాడు.

అయితే, కోచ్ రాహుల్ ద్రవిడ్, టీమిండియా మేనేజ్‌మెంట్ నుండి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఉన్న‌ప్ప‌టికీ ఇషాన్ కిషన్ రంజీ ట్రోఫీ ఆడటం లేదు. అతను జార్ఖండ్ జట్టులో సభ్యుడు. ఇషాన్ తర్వాత ఏం చేయాలనేది అంతా అతనిపైనే ఆధారపడి ఉంటుందని ద్రవిడ్ చెప్పాడు. ఇషాన్ కూడా జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్‌కు ఆడటం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స‌మాచారం. ఇలా ఏమీ చెప్ప‌కుండా తిరుగుతున్న ఇషాన్ వైఖరిపై టీమిండియా వ‌ర్గాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. దీంతో ఇషాన్ కిష‌న్ సెంట్రల్ కాంట్రాక్ట్ పై కూడా ప్ర‌భావం ప‌డ‌నుంద‌ని తెలిసింది. కేటగిరీ-సి కాంట్రాక్టులో ఉన్నాడు. ఇలాంటి ప‌రిస్థితుల‌ను చూస్తున్న క్రికెట్ ప్రియులు, క్రికెట్ వ‌ర్గాలు ఇట్ల చేస్తున్న‌వేంది ఇషాన్ కిష‌న్.. జ‌ట్టులోకి రావ‌ద్ద‌నుకుంటున్నావా ఏందీ.. ! అంటూ నెట్టింట‌ కామెంట్లు చేస్తున్నారు.

టీమిండియాకు ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ వార్నింగ్.. బాజ్ బాల్ తో అన్నంత‌ప‌ని చేస్తారా..?

Follow Us:
Download App:
  • android
  • ios